NTV Telugu Site icon

Shiva Vedha Movie Review: శివ ‘వేద’ (కన్నడ డబ్బింగ్)

Vedha

Vedha

Shiva Vedha Movie Review: సినిమాల హద్దులు చెరిగి భాషల కతీతంగా ప్రాంతీయ సినిమాలు కూడా ఇండియన్ సినిమాగా మారటం, దక్షిణాది సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తూ భారతీయ సినిమాకు గౌరవాన్ని తెస్తున్న నేపథ్యంలో పలు భాషల్లో రూపొందుతున్న సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్న తరుణమిది. ఈ నేపథ్యంలో కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయాలని భావించి ముందుగా గత ఏడాది డిసెంబర్ 23న కన్నడ, తమిళ భాషల్లో విడుదలై ఫిబ్రవరి 9న తెలుగునాట రిలీజ్ అయిన సినిమా శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

85లో వేద (శివరాజ్ కుమార్), తన కూతురు కనక (అదితిసాగర్) వరుసగా హత్యలకు పాల్పడుతుంటారు. జైలు నుంచి విడుదలైన కనక తండ్రితో కలసి తన తల్లి పుష్ప( గానవి లక్ష్మన్) మృతికి కారకులైన వారిని వెంటాడి మరీ హత్యలను చేస్తుంటారు. హతులను వేడాడే క్రమంలో ప్లాష్ బ్యాక్ లో వేద కథను తెలియచేస్తారు. ఇలా 60లలో, 80లలో సాగే వేద స్టోరీని లీనియర్, నాన్ లీనియర్ మిక్స్ చేస్తూ నెరేట్ చేస్తాడు దర్శకుడు. ఇక వేద, కనక హత్యాకాండకు దయా (రఘు షిమోగా) సహకరిస్తుంటాడు. అయితే దయాని ఓ సెక్స్ వర్కర్ పరి (శ్వేత చెంగప్ప) చంపాలని ట్రై చేస్తుంది. వీరిని ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ రమ (వీణా పాన్నప్ప) ట్రాక్ చేస్తూ ఉంటుంది. అయితే వేద కథ తెలిసిన రమ వారిని ఎప్పుడూ అడ్డుకోదు. తండ్రీ కూతుళ్ళు తమ పగను తీర్చుకోవటమే కాదు ఆపద ఎదురైనపుడు ఆడపిల్లలు తిరగబడాలనే అంశాన్ని తెలుపుతూ ముందుకు సాగుతారు. నిజానికి వేద కథను మైసూరులో బస్ లో టీజింగ్ ఫేస్ చేస్తున్న ఓ కార్పొరేట్ ఉద్యోగినికి ఆమె అమ్మమ్మ తెలియచేస్తుంది. ఆ కథ విన్న ఆ ఉద్యోగిని ఆత్మవిశ్వాసంతో టీజింగ్ చేసే వ్యక్తిని ఎదుర్కొనటంతో కథ ముగుస్తుంది.

నిజానికి ఈ చిత్ర కథాంశం ఇప్పటికీ సమాజంలో మహిళలు ఎదుక్కొంటున్నదే. అయితే తమ సమస్యలను వారి సమర్ధవంతంగా ఎదుర్కొనాలి అని చెప్పే క్రమంలో హింసకే పెద్ద పీట వేశాడు దర్శకుడు హర్ష. మహిళలు ఎదురుతిరగాలనే తన ఇంటెన్షన్ మంచిదే కానీ వయొలెన్స్ పాలు ఎక్కువ కావటంతో వేద సినిమా కూడా ఓ పగ ప్రతీకారం మార్క్ సినిమాగా మిగిలిపోతుంది. వేదగా శివరాజ్ కుమార్ కి ఈ తరహా కథాంశాలు కొట్టిన పిండే. అదీ కాక ఇది తన 125వ సినిమా కావడంతో ఫ్యాన్స్ ని అలరించేలా యాక్షన్ సీన్స్ తెరకెక్కాయి. పుష్పగా నటించిన గానవి, కనక పాత్రలో నటించిన సింగర్ అదితి సాగర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రత్యేకించి వీరిద్దరూ యాక్షన్ సీన్స్ లో కనబరిచిన నటన అద్భుతం. వేద తల్లిగా ఉమాశ్రీ, సెక్స్ వర్కర్ పాత్రలో శ్వేత తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అర్జున్ జన్య సంగీత దర్శకత్వంలో ‘పుష్ప పుష్ప..’ పాటతో పాటు నేపథ్యసంగీతం కూడా ఆకట్టుకునేలా సాగింది. స్వామిగౌడ సినిమాటోగ్రఫీ, దీపు ఎడిటింగ్ ఓకె. శివరాజ్ కుమార్ సతీమణి గీత నిర్మాత కావటంతో నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదు. చైల్డ్ అబ్యూజ్ వంటి సున్నితమైన అంశాన్ని చర్చించిన ‘వేద’ కారకులైన వారిపై తిరగబడాలని సూచిస్తుంది.

రేటింగ్: 2.5/5

ప్లస్ పాయింట్స్
శివరాజ్ కుమార్, అదితి, గానవి నటన
నిర్మాణ విలువలు
అర్జున్ జన్య నేపథ్యసంగీతం
కథ, కథనం

మైనస్ పాయింట్స్
హింస ఎక్కువ కావటం
జిగ్ జాగ్ కథనం
కన్నడ నేటివిటి

ట్యాగ్ లైన్
వయొలెంట్ ‘వేద’

Show comments