NTV Telugu Site icon

Lust Stories 2 Review: లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ

Lust Stories 2 Review

Lust Stories 2 Review

Lust Stories 2 Review: లస్ట్ స్టోరీస్ 1 ఏకంగా ఇండియన్ OTT ప్రపంచంలో అనేక ప్రకంపనలు సృష్టించింది. అప్పట్లో ఈ సిరీస్ ను చూసి చాలా మంది మేకర్స్ బోల్డ్ కంటెంట్ మీద దృష్టి పెట్టేలా చేశాయి. ‘లస్ట్ స్టోరీ 2’లో మృణాల్ ఠాకూర్, తమన్నా భాటియా, కాజోల్ వంటి వారు కనిపిస్తూ ఉండడంతో ఈ సిరీస్ మీద అందరి దృష్టి పడింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? లస్ట్ స్టోరీస్ వన్ చూసిన తర్వాత, అలాంటి సిరీస్ కి సీక్వెల్ అని భావిస్తున్న లస్ట్ స్టోరీస్ 2 రిలీజ్ అయిన తరువాత లస్ట్ స్టోరీ 2ని చూడాలనుకుంటే , ఈ రివ్యూ ఖచ్చితంగా చదవండి, ఆ తరువాత చూడాలో వద్దో మీరే డిసైడ్ అవ్వండి.

లస్ట్ స్టోరీస్ 2 కథ ఏమిటంటే?
లస్ట్ స్టోరీస్ 2 కూడా లస్ట్ స్టోరీస్ 1 లానే ఒక అంథాలజీ సిరీస్ లానే ఉంటుంది. నాలుగు జీవితాలు, వారి జీవితాలను ఈ కామం ఎలా ప్రభావితం చేసింది ఏ లైన్ లో రాసుకున్నాడు. ముందుగా మృణాల్ ఠాకూర్ కధ. ఆర్ బాల్కీ ఈ సిరీస్‌లో మొదటి కథగా ఈ కథను సిన్చుకున్నాడు. ఈ కథలో మృణాల్ ఠాకూర్, అంగద్ బేడీలు పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన సమయంలో మృణాల్ ఠాకూర్ నానమ్మ అన్నిటికంటే ముందు లైంగిక అనుకూలత పరీక్ష చేసుకున్నాక, ఆ విషయంలో హ్యాపీ ఉంటేనే మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటుంది. ఇక ఆధునిక ఆలోచనలు ఉన్న కుటుంబం కూడా సెక్స్ పేరు వినగానే ఎలా వణికిపోతుందో చూపించే ప్రయత్నం జరిగింది. ఈ కథలో నీనా గుప్తా పాత్ర అసెట్. ఆమె డైలాగులు ఒక్కోసారి అసౌకర్యంగా అనిపిస్తాయి, కానీ నీనా గుప్తా మాటలు ఆలోచింపచేస్తాయి. చివరికి మృణాల్ పెళ్లితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

HDF Merger : హెచ్‎డీ‎ఎఫ్‎సీ విలీనం మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసా?

ఇక ఈ సిరీస్ లో రెండవ కథ కొంకణాసేన్ డైరెక్ట్ చేసింది . ఈ సిరీస్ లో కొంకణ సేన్ ప్రేక్షకుల మానసిక స్థితిని ఒక్కసారిగా ప్రశ్నించే ప్రయత్నం చేసింది. ఈ కథలో, తిలోత్తమ ఒంటరి మహిళ కాగా ఆమె ఇంట్లో అమృత సుభాష్ పని చేస్తుంది. తిలోత్తమ లేని సమయంలో ఆమె ఇంట్లో ఆమె బెడ్ మీద అమృత తన భర్తతో శృంగారంలో మునిగి తేలుతూ ఉంటుంది. ఈ విషయం తెలిసినా కూడా ఆమెను ఆపకుండా రోజు వారి రాసలీలలు చూసేందుకు వస్తుంది తిలోత్తమ. ఈ కథలో, కొంకణ సేన్ డైరెక్షన్ పాఠవాలు అద్భుతంగా ఉన్నాయి. కామానికి కుల, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేవని ర్ కథ మనకి చూపిస్తుంది.

సిరీస్ లో మూడవ కథ తమన్నా, విజయ్ వర్మలది. ఈ సిరీస్‌లో ఈ కథను సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేశారు. తమన్నా భాటియా -విజయ్ వర్మల కాంబినేషన్ అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది కానీ డైరెక్షన్ డిఫెక్ట్ కారణంగా ఈ కథ మెప్పించలేక పోయింది. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. ట్రైలర్ లో తమన్నా, విజయ్ వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు చూపించారు కానీ సిరీస్ లో కథ మాత్రం అది కాదు. ముందు బాగానే మొదలవుతుంది కానీ తమన్నా, విజయ్ వంటి ఇద్దరు ఉత్తమ నటులు ఉన్నా యావరేజ్ పెర్ఫార్మెన్స్‌తో క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లైమాక్స్ ను కూడా క్లారిటీ లేకుండా ముగించాడు ఘోష్.

ఇక ఈ సిరీస్ లో చివరిదైన, ఉత్తమ కథను అమిత్ శర్మ అందించారు. ఈ ఎపిసోడ్ లో ఒక మిడిల్ ఏజ్ జంట కథను చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కాజోల్, కుముద్ మిశ్రాల ద్వారా అమిత్ శర్మ చెప్పిన కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా క్లైమాక్స్, బిల్డప్ అద్భుతంగా ఉన్నాయని చెప్పడం తప్పదు. మీరు ముందు జరగబోయే కథను ఈజీగా అర్ధం చేసుకున్నట్టు భావిస్తారు, కానీ అప్పుడే ఒక ట్విస్ట్ తెర మీదకు వస్తుంది. కుముద్ మిశ్రా పాత్రలో నటించిన విధానం చూస్తే మీరు అతనిని అసహ్యించుకోవడం మొదలుపెడతారు. కాజోల్ తన పాత్రలో ఇమిడిపోయింది.

బాటమ్ లైన్:
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో విషయం తక్కువ పబ్లిసిటీ ఎక్కువ.