NTV Telugu Site icon

#Life Stories Review: ‘#లైఫ్ స్టోరీస్’ రివ్యూ

Life Stories Review

Life Stories Review

#Life Stories Review in telugu: సినిమా అంటే ఒక కథనే కాకుండా వివిధ కథలు తీసుకుని వాటిని మిళితం చేసి ఆంథాలజీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ సక్సెస్ అవుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ‘#లైఫ్ స్టోరీస్’ అనే సినిమాను కూడా అదే కోవలో తెరకెక్కించారు. ఉజ్వల్ కశ్యప్ డైరెక్షన్లో ఇప్పటి వరకు నాలుగైదు కథలతోనే ఆంథాలజీలు రాగా ఈ సినిమాను మాత్రం ఏకంగా ఆరు కథలతో ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. మరి ఈ ‘#లైఫ్ స్టోరీస్’ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి.

కథ:
మొదటి కథ: ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి క్యాబ్‌లో వెళ్తుండగా కారులో డ్రైవర్‌కి సంబంధించిన కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి. ఇంజనీరింగ్‌ చేసి.. క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న విషయం తెలిసి మొదలైన సంభాషణనే మొదటి కథ.
రెండో కథ: ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్న ఇద్దరు భార్యాభర్తలు న్యూ ఇయర్‌ రోజున కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటారు.కానీ భార్య శ్రేయ (షాలిని కొండేపూడి)కి తన బాస్‌ ఎక్కువ వర్క్‌ ఇవ్వడంతో ఆఫీస్‌లోనే ఉండిపోవాల్సి రావడంతో భార్యభర్తలు కలిసి న్యూఇయర్‌ సెలెబ్రేట్‌ చేసుకున్నారా లేదా? అనేది కథ.
మూడో కథ: ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలు మంగమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. రోడ్డు పక్కన టీ షాపు పెట్టుకుని జీవితాన్ని గడిపే ఆమెకు కొనుక్కునే స్థోమత ఉండదు. ఓ రోజు రోడ్డుపై ఓ పెంపుడు కుక్కని ఎవరో వదిలి వెళ్లిపోతే ఆ కుక్కను బంగారం అని పేరు పెట్టి మంగమ్మ పెంచుతుంది. ‘బంగారం’ కాని బంగారం వచ్చాక మంగమ్మ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందనేది మిగతా కథ.
నాలుగో కథ: ఓ సింగిల్‌ మదర్‌(దేవియని శర్మ) ఉద్యోగ ఒత్తిడి కారణంగా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతుంది. తల్లితో ఆడుకోవాలని, లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లాలని ఆశ పడే కొడుకు ఆశ నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ.
ఐదో కథ: న్యూ ఇయర్‌ సెలెబ్రేషన్స్‌ కోసం ఓ జంట రిసార్ట్‌కి వెళ్లగా అక్కడ భర్తకి కాలేజీ ఫ్రెండ్‌ కనిపించడంతో వారిద్దరు కలిసి మద్యం సేవిస్తూ కాలేజీ ముచ్చట్లు చెప్పుకుంటారు. మరోవైపు ఇద్దరి భార్యలు కూడా గదిలోకి వెళ్లి మందు తాగుతూ సరదాగా గడుపుతుంటారు. ఆ సంభాషణ ఏంటి అనేది కథ.
ఆరో కథ: సాఫ్‌వేర్‌ ఉద్యోగి తన ప్రియురాలితో కలిసి న్యూ ఇయర్‌ సెలెబ్రేట్‌ చేసుకోవాలనుకోగా చివరి నిమిషంలో ఆమె రాలేనని చెబుతుంది. లవర్‌ హ్యాండ్‌ ఇచ్చిన తర్వాత ఆ సాఫ్‌వేర్‌ ఉద్యోగి ఏం చేశాడు? విడివిడిగా సాగిన ఈ ఆరు కథలు చివరకు ఎలా కలిశాయి అనేది #లైఫ్‌స్టోరీస్‌ సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:
ఆరు కథలను కలిపి చేసిన సినిమా ‘#లైఫ్ స్టోరీస్’. ఆరు కథలను ఒకదాన్నీ మరోదానికి ఎలా సింక్ చేశారు అన్నదే ‘#లైఫ్ స్టోరీస్’. అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసిన తీరు ఆసక్తికరం. ఇది ఆరు కథల సినిమా అనేకంటే కొన్ని జీవితాలను ప్రతిబింబించే ఒక లైవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇందులో కేవలం ఆరు కథలే కాదు, ఆ ప్రతి కధలో ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. ఈ సినిమాను ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా నిజ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించే ఈ చిత్రానికి విడుదలకు ముందే ఎన్నో అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాలో కాస్టింగ్ ఇంకా బాగుంటే ఈ సినిమా రీచ్ ఇంకా పెరిగేది. అయితే అద్భుతం అనలేం కానీ కొన్ని జీవితాలను మనం రోజు వారే చూసే వ్యక్తులను దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే ప్రతి కథలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా మంగమ్మ పాత్ర పోషించిన వృద్ధురాలు సహజంగా నటించింది. సింగిల్ మదర్ గా దేవియాని శర్మ, బస్సు కండక్టర్‌గా శుభోదయం సుబ్బారావు, సత్య కూడా అదరగొట్టారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే సంగీతం చాలా చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫర్ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ : ‘#లైఫ్ స్టోరీస్’ నిజంగానే లైఫ్ అండ్ లైవ్ స్టోరీస్