Lambasingi Telugu Movie Review: బిగ్ బాస్ షో ద్వారా ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ దివి. ఈ తెలుగమ్మాయి గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది కూడా. అయితే ఆమె హీరోయిన్ గా మారి ఒక సినిమా చేసింది. ఆ సినిమా పేరే లంబసింగి. కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాతగా మారిన ఈ సినిమాలో భరజ్ రాజ్ హీరోగా నటించాడు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నవీన్ గాంధీ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా మార్చి 15 న ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఎలా ఉంది అనేది రివ్యూలో చూసి తెలుసుకుందాం.
లంబసింగి కథ : వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవగా మొదటి పోస్టింగ్ లంబసింగి అనే ఊరిలో పడుతుంది. ఆ ఊరి డ్యూటీ కోసం వెళ్లి బస్సు దిగగానే హరిత(దివి)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆ తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లుగా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో దివి తండ్రి కూడా ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని ఒక కంట గమనిస్తూ ఉండాలి, అయితే ఈడ్యూటీనీ వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి వీరబాబు రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించడం కోసం ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరితకి తన ప్రేమ గురించి చెప్పాలని డిసైడ్ అయ్యి తన ప్రేమని వ్యక్తపరచగా ఆమె అందుకు ఒప్పుకోదు. ఇదిలా ఉండగా నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలు తీసుకెళతారు. అందులో గాయపడిన వీరబాబుకి ఒక షాక్ ఎదురవుతుంది. ఆ షాక్ ఏంటి? అసలు హరిత వీరబాబు ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఇలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ : లంబసింగి అనగానే కాశ్మీర్ గా ఫేమస్ అయిన విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక హిల్ స్టేషన్ గుర్తుకొస్తుంది ఆ హిల్ స్టేషన్ లోనే జరిగిన కథగా ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్. సాధారణంగా ఆ ప్రాంతాలు నక్సలైట్లు ఎక్కువగా తిరిగాడే క్రమంలో ఒక ఆసక్తికరమైన పాయింట్ రాసుకున్నాడు. రాసుకున్న పాయింట్ మొత్తాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరమైన కథనంతో తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఇక దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో మొదట కొంచెం స్లో నేరేషన్ అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ ఒక సడన్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా రాసుకున్నాడు.ఇక క్లైమాక్స్ అయితే ఎమోషనల్ గా కట్ చేయడం గమనార్హం. ఇక హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే సోషల్ మీడియాలో గ్లామర్ అప్పీల్ ఉండడంతో దివిని ఎక్కువగా గ్లామర్ పాత్రల కోసమే అన్నట్టు దర్శకులు చూపిస్తూ వచ్చారు. కానీ ఆమెలో సహజమైన నటి ఉందని ‘లంబసింగి’ ద్వారా అందరికీ తెలిసొచ్చేలా ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు ఆమె నటన ఉన్నాయి. హరిత అనే ఒక భిన్న పార్శాలు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హీరో భరత్ వీరబాబు అనే పాత్రలో చాలా బాగా నటించాడు. క్లైమాక్స్ లో ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, మాధవి వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇకటెక్నికల్ టీం విషయానికి వచ్చేసరికి దర్శకుడు నవీన్ గాంధీ ‘లంబసింగి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసి చాలా వరకు సఫలం అయ్యాడు. ఇక ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ప్రతి పాట ఆడియో లానే తెరపై కూడా వాటిని అందంగా పిక్చరైజ్ చేయడంలో కెమెరామెన్ కె.బుజ్జి తన పని తనం చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ఫైనల్లీ : ‘లంబసింగి’ సినిమా నక్సల్స్ – పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టొరీ..