NTV Telugu Site icon

Kaliyugam Pattanamlo Review: కలియుగం పట్టణంలో రివ్యూ

Kaliyugam Pattanamlo

Kaliyugam Pattanamlo

Kaliyugam Pattanamlo Movie Review: ఇప్పటికి పలు టాలీవుడ్ సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన విశ్వ కార్తికేయ హీరోగా తెలుగమ్మాయి ఆయుషి పటేల్ హీరోయిన్ గా కలియుగం పట్టణంలో అనే సినిమా తెరకెక్కింది. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే అందిస్తూనే దర్శకత్వం కూడా చేశారు రమాకాంత్ రెడ్డి. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ సినిమా మార్చి 29 విడుదలైంది. టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్‌ను ఎంత మేరకు ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ
ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాలలో మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన(రూప లక్ష్మి) తమ కవల పిల్లలు విజయ్ ( విశ్వ కార్తికేయ), సాగర్ ( విశ్వ కార్తికేయ)లతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. అయితే అవడానికి కవల పిల్లలే అయినా అందులో విజయ్ రక్తం చూసి భయపడితే.. సాగర్ మాత్రం ఆనంద పడతాడు. సైకో లక్షణాలు ఉన్న సాగర్ బయట తిరిగితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అని భయపడి బాల్యంలోనే మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తారు. కాలేజీలో చేరాక విజయ్ తో శ్రావణి (ఆయుషి పటేల్) ప్రేమలో పడుతుంది..అయితే అదే సమయంలో అత్యాచారాలు చేసే క్రూర మృగాలను వేటాడి చంపుతూ ఉంటారు. నంద్యాలలో జరిగే ఈ హత్యలను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) వస్తుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్.. సాగర్ లలో ఎవరు మంచి వారు? ఎవరు చెడ్డ వారు? అక్కడ జరిగే హత్యలరో వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీస్ ఆఫీసర్ ఏం చేసి అక్కడి క్రైమ్ కథలకు ఫుల్ స్టాప్ పెట్టింది? అనేది సినిమా కథ.

విశ్లేషణ
దర్శకుడు కలియుగం పట్టణంలో కోసం మంచి పాయింట్, కథను తీసుకున్నా స్క్రీన్ ప్లే విషయంలో తడబడినట్లు అనిపించింది. అయితే సినిమాలో చూసిన తర్వాత క్రైమ్స్ నీ ఇలా కూడా చేయొచ్చా? అనే భయం కలిగించేలా రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో చిక్కుముల్లతో నిండి పోయింది. వాటికి సమాధానాలు సెకండ్ హాఫ్ లో రీవీల్ చేస్తూ వెళ్ళారు. ఫస్ట్ హాఫ్ ఎంతో ఇంటరెస్టింగ్ గా అన్పిస్తుంది కానీ ద్వితీయార్థంలో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకులకు షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్టులు, రెండో పార్ట్ కోసం వదిలిన లైన్ బాగుంది. పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి.. ఎలా పెంచకూడదు.. తల్లిదండ్రుల పెంపకం సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని చక్కగా చూపించడంలో దర్శకుడు సఫలమయ్యారు.

నటీనటుల విషయానికి వస్తే కనుక విజయ్, సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ తనదైన వేరియేషన్స్ చూపించాడు. మంచి వాడిగా, సైకోగా నటించి కొన్ని చోట్ల భయపెట్టాడు. ఆయుషి పటేల్ తన పాత్రతో ఆకట్టుకుంది. చిత్రా శుక్లాకి మంచి రోల్ పడింది. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల ఇలా అన్ని పాత్రలు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుంది. అజయ్ పాటలు, అర్ అర్ సినిమాకి అసెట్. చరణ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది.

ఫైనల్లీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

Show comments