NTV Telugu Site icon

Joruga Husharuga Review: బేబీ ఫేమ్ విరాజ్‌ అశ్విన్‌ ‘జోరుగా హుషారుగా’ రివ్యూ

Joruga Husharuga Movie Review

Joruga Husharuga Movie Review

Joruga Husharuga Movie Review: బేబీ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించాడు విరాజ్ అశ్విన్. ఆ సినిమాలో ఆయన కొంత నెగటివ్ రోల్ లో నటించినా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక ఈ క్రమంలో ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా జోరుగా హుషారుగా అనే సినిమా చేశారు. పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది? అనే వివరాలు తెలియాలంటే సినిమా రివ్యూ చదివేయాల్సిందే.

జోరుగా హుషారుగా కథ: తెలంగాణలోని పోచంపల్లిలోని ఓ చేనేత కుటుంబంలో పుట్టిన సంతోష్‌ (విరాజ్‌ అశ్విన్‌) ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తానని పట్టుబట్టి తండ్రి(సాయి కుమార్) చేత చేనేత సొసైటీలో రూ.20లక్షలు అప్పు చేయించి, ఆ డబ్బుతో హైదరాబాద్‌కు వస్తాడు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కట్టించుకున్న కన్సెల్టింగ్‌ కంపెనీ బోర్డు తిప్పేయడంతో రోడ్డున పడే స్థితిలో స్నేహితుడి సహాయంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ఉద్యోగం సంపాదిస్తాడు. తనకొచ్చే చాలీచాలని జీతంతో తండ్రి అప్పు తీర్చడం పెద్ద సమస్యగా మారగా బాస్‌ ఆనంద్‌ (మధునందన్‌)ను మెప్పించి జీతం పెంచుకుని లోన్ తెచ్చుకునే ప్లాన్ చేస్తాడు. 40 దగ్గర పడుతున్నా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న బాస్‌ను ఎలాగైనా పెళ్లి పీటలెక్కించాలని ప్రయత్నాలు చేస్తుండగా అదే సమయంలో అదే ఆఫీస్‌లో చేరుతుంది సంతోష్‌ లవర్ నిత్య (పూజిత పొన్నాడ). ఆఫీస్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రేమ విషయాన్ని బయటపెట్టొద్దని నిత్యకు చెబుతాడు సంతోష్. అయితే కొన్ని పరిస్థితుల వలన సంతోష్‌ ప్రేమ, ఉద్యోగం రెండూ చిక్కుల్లో పడతాయి. అయితే అతని ప్రేమకు ఎదురైన చిక్కులేంటి? అది ఉద్యోగానికి కూడా ఎలా ఇబ్బందిగా మారింది? చివరికి తండ్రి చేసిన అప్పు విరాజ్ తీర్చాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ముందు నుంచి సినిమా యూనిట్ చెబుతున్నట్టుగా ఇది సగటు లవ్ స్టోరీ. కొత్త కథ అనలేం కానీ ఉన్న ప్రేమ కథకు తండ్రి సెంటిమెంట్‌ను ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక ప్రేమ కథకు తండ్రి సెంటిమెంట్‌ యాడ్ చేసి మధ్యలో ఫన్ జనరేట్ చేస్తూ దర్శకుడు అను ప్రసాద్ చేసిన ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయింది. ఒక పక్క యూత్‌ను దృష్టిలో పెట్టుకొని లవ్, రొమాన్స్‌తో కథను ముందుకు తీసుకు వెళ్తూనే సాయికుమార్, రోహిణితో ఒక ఎమోషనల్ సీన్స్ రక్తి కట్టించిన విధానం అయితే బాగుంది. యూత్‌ను మెప్పించేలా కామెడీ, ఫన్ ఎలిమెంట్స్‌ను బ్రహ్మాజీ, జెమిని కిరణ్, రాజేశ్ ఖన్నాతో వంటివారితో చేయించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. అయితే ప్రేమకథలో కొత్తదనం లేకపోవడం కొంత మైనస్. ముందుగా సంతోష్‌ పరిచయం, అతని లవ్ స్టోరీ, జీవితంలో ఎదగాలనుకున్న క్రమం, ఆ తరువాతి ఆఫీస్‌ వాతావరణాన్ని పరిచయం చేస్తూ ఆ ఆ తర్వాత నిత్య అతని ఆఫీస్‌లో జాయిన్‌ అవ్వడంతో కామెడీ ట్రాక్ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా సంతోష్‌ తన ప్రేమను ఆనంద్‌ దగ్గర ఎలా బయటపెట్టాడు? నిత్యపై నుంచి అతని దృష్టి మళ్లించి సుచిత్రను ఎలా దగ్గర చేశాడు? లాంటి విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు.

నటీనటుల విషయానికి వస్తే బేబీ తర్వాత విరాజ్ అశ్విన్ చేసిన ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో విరాజ్ మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. పూజిత పొన్నాడ‌ భలే పాత్రలో మెరిసింది. సిరి హనుమంతు తన పాత్రలో ఒదిగి పోయింది. మధు నందన్, సాయికుమార్, రోహిణి, రాజేష్ ఖన్నా వంటి నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాకు సినిమాటోగ్రఫి బాగా నప్పింది. సీన్లను చాలా రిచ్‌గా తీసుకురాడంలో సఫలం అయ్యాడు. ఇక ప్రణీత్ నంబూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మార్తాండ్ వెంకటేష్ అనుభవం కనిపించింది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా వెనక్కి తగ్గినట్టు అనిపించలేదు.

ఫైనల్లీ: అంచనాలు లేకుండా జోరుగా హుషారుగా థియేటర్లకు వెళితే ఎంజాయ్ చేస్తారు.

Show comments