NTV Telugu Site icon

Ghani Review : అదరని పంచ్!

Ghani

Ghani

తారాగణం : వరుణ్ తేజ్, సాయీ మంజ్రేకర్, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా, నరేశ్, తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర, హరితేజ, ఆషూ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు. తమన్నా (స్పెషల్ సాంగ్)

సంగీతం: తమన్
మాటలు: అబ్బూరి రవి
సినిమాటోగ్రఫి: జార్జ్ సి.విలియమ్స్
నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కిరణ్‌ కొర్రపాటి

‘గద్దల కొండ గణేశ్’ తరువాత వరుణ్‌ తేజ్ నటించిన ఏ చిత్రమూ విడుదల కాలేదు. దాదాపు ఏడాదిన్నర తరువాత వరుణ్ తేజ సినిమాగా ‘గని’ జనం ముందు నిలచింది. దాంతో మొదటి నుంచీ బజ్ బాగానే ఉంది. ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో అల్లు అర్జున్ అన్నఅల్లు బాబీ పాలు పంచుకోవడం విశేషం. తమన్నా ఐటమ్ సాంగ్ ఇప్పటికీ అలరిస్తోంది. ఇన్ని ప్రత్యేకతలతో ‘గని’ ప్రేక్షకుల తీర్పుకై శుక్రవారం వారి ముందు నిలచింది.

కథేమిటంటే : ‘గని’ (వరుణ్ తేజ్) తండ్రి విక్రమాదిత్య (ఉపేంద్ర) ఓ బాక్సర్. అతను స్టెరాయిడ్స్ తీసుకున్నాడని ఆట నుండి బ్యాన్ చేస్తారు. అతడు చనిపోయిన తరువాత కూడా గని, అతని తల్లి నిందలకు గురవుతారు. దాంతో వైజాగ్ కు వెళ్ళి జీవిస్తుంటారు. గనికి తండ్రి అంటే ద్వేషం పెరుగుతుంది. కానీ, అదే బాక్సింగ్ మీదనే దృష్టి పెడతాడు, బాక్సర్ గా మారతాడు. తల్లికి బాక్సింగ్ ముట్టనని ప్రామిస్ చేసినా, దాన్ని పక్కన పెట్టి, పోటీకి దిగి బాక్సింగ్ నియమాలకు విరుద్ధంగా పోరాడి ఎలిమినేట్ అవుతాడు. తండ్రిని తిట్టుకుంటున్న గని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి ‘మీ నాన్న ఎంతో గొప్పవాడు, అతను బాక్సింగ్ ఆటను బ్రతికించాలని పాటుపడ్డాడు’ అని చెబుతాడు. మీరెవరు అన్న గని ప్రశ్నకు , ఆ రోజు మీ తండ్రిపై పోటీలో గెలిచిన విజయేంద్ర సిన్హా (సునీల్ శెట్టి)ను నేనే అంటాడు. విక్రమాదిత్య కోచ్ ఈశ్వర్ నాథ్ (జగపతిబాబు) మోసం కారణంగానే ఆట నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలియచేస్తాడు. గని తన తప్పు తెలుసుకుంటాడు. ఎలాగైనా నేషనల్ లెవెల్లో చాంపియన్ కావాలని తపిస్తాడు. ఆ క్రమంలో విజయేంద్ర సిన్హా అతనికి సాయం చేయడమే కాదు, కోచింగ్ ఇస్తాడు. అసలు సంగతి ఏమిటంటే, ‘నేషనల్ బాక్సింగ్ లీగ్’ అని నెలకొల్పి, దానిని నిర్వహిస్తున్నది ఈశ్వర్ నాథ్ అని తెలుస్తుంది. విక్రమాదిత్య కొడుకే గని అని ఈశ్వర్ నాథ్ కూ తెలుస్తుంది. అతని తండ్రిలాగే, అతణ్ణీ పైకి పంపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు ఈశ్వర్ నాథ్. దానిని గని ఎలా అధిగమించాడన్నదే మిగతా కథ.

వరుణ్ తేజ్ కు విలక్షణమైన పాత్రలు పోషించడంపై ఎంతో మక్కువ ఉందని ‘గద్దల కొండ గణేశ్’ నిరూపించింది. ఇందులోనూ బాక్సర్ గా నటించడానికి అతను ఎంత కసిగా వర్కవుట్స్ చేశారో, ఎలా మేకోవర్ అయ్యారో ఇట్టే తెలిసిపోతోంది. గనిగా అతని నటన మంచి మార్కులు సంపాదించింది. మిగిలిన పాత్రల్లో నాయిక సాయీ మంజ్రేకర్ తన పరిధుల్లో నటించింది.

దర్శకుడు కిరణ్ కొర్రపాటికి ఇది తొలి చిత్రమే అయినా, అనేక సన్నివేశాలను అనుభవం ఉన్నవాడిలా తెరకెక్కించారు. తమన్ స్వరకల్పనలో రూపొందిన “గని యాంథమ్…” అలరిస్తుంది. “కొడితే…” సాంగ్ లో తమన్నా అందం చిందేసి కనువిందు చేసింది. “రోమియో జూలియట్…” సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. విక్రమాదిత్యగా ఉపేంద్ర నటన ఆకట్టుకుంటుంది. నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. తగినంత వినోదం లేకపోవడం, లవ్ ట్రాక్ ఆకట్టుకోకపోవడం మెయిన్ మైనస్. అబ్బూరి రవి సంభాషణలు అక్కడక్కడా ఆలోచింప చేశాయి. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన బాబి, సిద్ధు ఎక్కడా రాజీ పడలేదనే చెప్పాలి. బాక్సింగ్ మీద తెలుగులో ఇప్పటికీ చాలా చిత్రాలే వచ్చాయి. సో… ‘గని’ కొత్తగా అనిపించదు.

ప్లస్ పాయింట్స్:

మైనస్ పాయింట్స్:

రేటింగ్: 2.5/5

ట్యాగ్ లైన్: అదరని పంచ్!