NTV Telugu Site icon

Dasvi Movie Review : ‘దస్వీ’ పాస్ కాలేదు!

Dasvi Movie Review

Dasvi Movie Review

తారాగణం: అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్, అరుణ్ కుష్వా, శివాంకిత్ సింగ్, శివమ్ రాయ్, సుమిత్ శేఖర్, శక్తి సింగ్
సినిమాటోగ్రఫి: కబీర్ తేజ్ పాల్
సంగీతం: సచిన్ – జిగర్
రచన: రితేశ్ షా, సురేశ్ నాయర్, సందీప్ లేజెల్
దర్శకత్వం: తుషార్ జలోట
నిర్మాణం: దినేశ్ విజన్
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్

‘హౌస్ ఫుల్-3’ తరువాత అభిషేక్ బచ్చన్ కు సరైన సక్సెస్ లేదనే చెప్పాలి. పైగా అది కూడా అక్షయ్ కుమార్ తో నటించిన మల్టీస్టారర్. ఆ తరువాత వచ్చిన చిత్రాల్లో ‘మన్ మర్జియా’ పరవాలేదనిపించింది. మిగిలిన మూడు సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. ఈ యేడాది అభిషేక్ బచ్చన్ నటించిన ‘దస్వీ’ కామెడీతో కబడ్డీ ఆడేందుకు థియేటర్లను కాదని, ఓటీటీలో వెలుగు చూసింది. షరా మామూలే అన్నట్టు ఓటీటీలో కూడా ‘దస్వీ’ పెద్దగా ఆకట్టుకొనే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక ‘దస్వీ’ కథ విషయానికి వస్తే… గంగారామ్ చౌదరి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పెద్దగా చదువు రాకపోయినా, అతనే ఆ స్టేట్ కు దిక్కుగా గెలుస్తూ ఉంటాడు. ఓ నేరం కారణంగా అతను జైలు పాలవుతాడు. తన భార్య విమలాదేవిని సీఎమ్ సీటులో కూర్చోబెట్టి జైలుకు వెళతాడు. ఎలాగైనా తనకు బెయిల్ వస్తుందని, తప్పకుండా మళ్ళీ సీఎమ్ పదవిలో కొనసాగుతాననే ధీమాతో ఉంటాడు గంగారామ్. ఎవరనీ లెక్క చేయని ఓ స్ట్రిక్ట్ ఆఫీసర్ జ్యోతీ దేస్వాల్ ను గంగారామ్ ఉన్న జైలుకు సూపరింటెండెంట్ గా నియమిస్తారు. పదవిలో ఉన్న మజా చూసిన తరువాత గంగారామ్ భార్య తన భర్త బయటకు రాకూడదని కోరుకుంటుంది. జైలులో ఏమో స్ట్రిక్ట్ సూపరింటెండెంట్ – ఈ ఇద్దరు మహిళల మధ్య గంగారామ్ సతమతమై పోతాడు. తనకు ఇంగ్లిష్ రాకపోవడం వల్లే ఈ తంటా అని తెలుసుకుంటాడు. పదో క్లాస్ చదువుకోవాలని భావిస్తాడు. అందులో అతను మేథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ చదువుకోవడంతో హిస్టరీలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. గంగారామ్ జైలులో ఉండగానే పదో క్లాస్ ఎలా పాసయ్యాడు అన్నది మిగిలిన కథ.

గంగారామ్ గా అభిషేక్ బచ్చన్, ఆయన భార్య విమలాదేవిగా నిమ్రత్ కౌర్, జైలు సూపరింటెండెంట్ జ్యోతీ దేస్వాల్ గా యామీ గౌతమ్ నటించారు. ఈ ప్రధాన పాత్రల చుట్టూనే కథ సాగుతుంది. కొన్నిసార్లు లాలూ ప్రసాద్ యాదవ్ కథ గుర్తుకు వస్తుంటుంది. దానికి తోడుగా రాజకీయ నాయకుల విద్యార్హత పైనా సెటైర్ వేస్తూ కథ సాగింది. ‘దస్వీ’లో పొలిటికల్ సెటైర్ కనిపించినా, అంతగా రక్తి కట్టించలేకపోయారు. బహుశా దర్శకుడు తుషార్ జలోటాకు ఇదే తొలి చిత్రం కావడం వల్ల కథను రంజుగా పండించలేకపోయారనిపిస్తుంది. పాటల్లో “మచా మచా రే…” అనేది కాస్త ఆకట్టుకుంటుంది. అంతకు మించి ఏమీ లేదు.

ప్లస్ పాయింట్స్:

మైనస్ పాయింట్స్:

రేటింగ్: 2/5

ట్యాగ్ లైన్: ‘దస్వీ’ పాస్ కాలేదు!