NTV Telugu Site icon

Buttabomma Movie Telugu Review : ‘బుట్టబొమ్మ’

Butta Bomma Review

Butta Bomma Review

 

ఓ భాషలో విజయం సాధించిన సినిమాలు మరో భాషలో తెరకెక్కడం సర్వసామాన్యం. అది ప్రేమకథ అయినా, వేరే ఏ జానర్ అయినా. అలా మలయాళంలో 2020లో విడుదలై చక్కటి విజయం సాధించిన సినిమానే ‘కప్పెల’. నిజానికి ఈ సినిమాను కరోనా లాక్ డౌన్ లో మన తెలుగు ఆడియన్స్ కూడా దాదాపు అందరూ చూసేశారు. అందుకేనేమో ఈ సినిమా రీమేక్ కూడా బాగా ఆలస్యంగా తెరమీదకు తీసుకు వచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ దీనిని ‘బుట్టబొమ్మ’ పేరుతో నిర్మించటంతో బాక్సాఫీస్ దృష్టి దీనిమీద పడింది. మరి శనివారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపించిందో చూద్దాం.

కథకి వస్తే సత్య (అనైకా సురేంద్రన్) అరకు ఏరియాలో ఓ పల్లెటూళ్ళో మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి. కుట్టుపని చేసే అమ్మకు సాయంగా ఉంటున్న సత్య తన స్నేహితురాలు, జగదీష్ ప్రేమలో ఉండి ఎప్పుడూ నువ్వు కూడా ప్రేమలో పడితే తెలుస్తుందని అంటూ ఉండటంతో తను కూడా ప్రేమలో పడాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఉంటుంది. నిజానికి తనను అదే ఊరికి చెందిన డబ్బున్న అబ్బాయి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే సత్య అనాలోచితంగా చేసిన ఓ రాంగ్ కాల్ తో మురళి (సూర్య వశిష్ఠ) పరిచయవుతాడు. ఆపై మాటలు పెరిగి ఇద్దరూ చూసుకోకుండానే ప్రేమలో పడతారు. ఇక ఇంట్లో తన పెళ్లికి ప్రయత్నాలు జరుగుతుండడంతో సత్య మురళిని కలవడానికి వైజాగ్ బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళిన అక్కడ సత్యకు ఎదురైన అనుభాలు ఏమిటి? అర్జున్ దాస్ తనవెంట ఎందుకు పడతాడు? సత్య తన ప్రేమలో సక్సెస్ అవుతుందా? లేదా? అన్నదే సినిమా కథాంశం.

ఎందుకో ఏమో కానీ ఈ రీమేక్ మాతృకలా చక్కటి ఫీలింగ్ ను ఇవ్వలేదు. మలయాళ సినిమా చూసి ఉండటం అందుకు ఓ కారణం కావచ్చు. ఇక నటీనటులు మాత్రం చక్కటి ప్రదర్శన కనబరిచారు. హీరోయిన్ గా నటించిన అనైకా సురేంద్రన్ అజిత్ ‘విశ్వాసం’లో చిన్న పిల్లలా ఆకట్టుకున్నప్పటికీ టైటిల్ కి తగ్గట్లు ‘బుట్టబొమ్మ’ అనే ఇంప్రెషన్ ను మాత్రం కలిగించలేకపోయింది. నటిగా మాత్రం పర్వాలేదు. ఇక మురళిగా నటించిన సూర్య వశిష్ట, అర్జున్ దాస్ మాత్రం తమ పాత్రలను ఇరగదీశారు. జగదీశ్ తన లవ్ ఇంట్రస్ట్ మధ్య కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు. ప్రథమార్ధం అంతా సోసో గా సాగినా హీరోయిన్ వైజాగ్ చేరటం, అక్కడ అర్జున్ దాస్ ఎంట్రీ తర్వాత కొంత ఆసక్తిని కలిగిస్తుంది. దీంతో ద్వితీయార్ధం ఫాస్ట్ గా సాగుతుంది. గోపీసుందర్ సంగీతంలోఆకట్టుకునే పాట ఒక్కటి లేకపోవడం ఆశ్చర్యకరం. నేపథ్య సంగీతం వరకూ ఓకె. దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ రమేష్ మాతృకను యాజ్ ఇట్ ఈజ్ గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశాడు. ఏదో మార్చాలి కాబట్టి అన్నట్లు ఆరంభంలో కథానాయిక వైజాగ్ ఎంట్రీ తర్వాత ఫ్యాష్ బ్యాక్ లో తను ఎందుకు అక్కడకు వచ్చిందన్నది చూపించటం తప్ప. సినిమా నిడివి తక్కువగా ఉన్నప్పటికీ పూర్తయిన తర్వాత కూడా ఎదో వెలితి వెంటాడుతుంది.

రేటింగ్
2.25/5

ప్లస్ పాయింట్స్
మాటలు
నిడివి తక్కువ కావటం

మైనస్ పాయింట్స్
కొత్తనటీనటులు కావటం
సంగీతం
మాతృకను ఎక్కువమంది చూసి ఉండటం

ట్యాగ్ లైన్ : ఉత్త బొమ్మ

Show comments