NTV Telugu Site icon

Bhoothaddam Bhaskar Narayana Review: భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ

Bbnr

Bbnr

Bhoothaddam Bhaskar Narayana Review: చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ఉంటే ఆదరిస్తున్నారు తెలుగు ఆడియన్స్. అయితే నిజానికి డిటెక్టివ్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మంచి ఫ్యాన్స్ భేస్ ఉంది. చిరంజీవి చంటబ్బాయి, నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అలా ఆదరణ పొందినవే. ఇక ఇప్పుడు అదే జానర్ లో శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ మీద కూడా తెరకెక్కింది. ప్రమోషనల్ కంటెంట్ బాగుండటంతో పాటు ఈ డిటెక్టివ్ కథకు పురాణాలతో కూడా లింక్ చూపడంతో ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా ? అనేది రివ్యూలో చూద్దాం పదండి.

కథ:

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్న చించోలీలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల తల నరికేసి ఆ స్థానంలో దిష్టిబొమ్మని పెడతాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలుగా భావిస్తూ పోలీసులు సీరియల్ సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తన అన్న వల్ల డిటెక్టివ్ గా మారిన భాస్కర్ ఈ కేసును సాల్వ్ చేయడానికి రంగంలో దిగుతాడు. లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి)గా పేరు తెచ్చుకున్న ఆయన ఈ కేసుని చేధించాడా? ఈ కేసుకి పురాణాలకి మధ్య వున్న లింక్ ఏంటి? భాస్కర్ నారాయణ కి భూతద్దం భాస్కర నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ హత్యలన్నీ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయం తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ:

కంటెంట్ ఈజ్ కింగ్ అని ఎన్నో సినిమాలు నిరూపించాయి, ఈ సినిమా మేకర్స్ కూడా కంటెంట్ ను నమ్ముకునే రంగంలోకి దిగినట్టు అనిపించింది. తెలుగులో డిటెక్టివ్ సినిమాలు అనగానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చంటబ్బాయి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా దాదాపు వాటి ఇన్స్పిరేషన్తోనే రాసుకుని భిన్నమైన ట్రీట్మెంట్ తో తెరకెక్కించినట్లు అనిపించింది. థ్రిల్లర్ కథలకు వుండాల్సిన ప్రధాన లక్షణం సస్పెన్ ని ఎండ్ కార్డ్ వరకు బోర్ కొట్టించకుండా ఆసక్తి సడలకుండా చూసుకోవడమే. ఈ విషయంలో భూతద్ధం భాస్కర్ నారాయణ టీం గట్టి ప్రయత్నమే చేసింది. దానికి తోడు ఒక క్రైమ్ థ్రిల్లర్ కి మన పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. నిజానికి ఈ జానర్ లో సినిమాలు వచ్చాయి కానీ ఇదే పాయింట్ తో తెలుగులో సినిమాలు రాలేదనే చెప్పాలి. ముందు కొంత ప్రేమ, కామెడీ అంశాలు ఉన్నా సీరియల్ కిల్లింగ్స్ తెరపైకి వచ్చిన తర్వాత కథ చాలా ఉత్కంఠ అనిపిస్తుంది. ఇక సీరియల్ కిల్లర్ ఎవరు ?అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఫస్టాఫ్ కొంతవరకు సోసోగా అనిపించినా ద్వితీయార్ధంలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులని మరితంగా అలరిస్తాయి. దర్శకుడు రాసుకున్న మైథాలజికల్ పాయింట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

నటీనటుల విషయానికి వస్తే శివ కందుకూరి, భాస్కర్ నారాయణ పాత్రలో సరిగ్గా నప్పాడు. సాధారణంగా డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు కానీ శివ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్ గా ఉంది. గత సినిమాలతో పోలిస్తే యాక్టింగ్ లో మంచి యీజ్ చూపించాడు. రిపోర్టర్ లక్ష్మీ అనే పాత్రలో రాశి సింగ్ నటన ఆకట్టుకునేలా ఉంది. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తె శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం ఈ సినిమాకి పెద్ద ఎసెట్. థ్రిల్లర్ కి కావాల్సిన మూడ్ ని క్యారీ చేయడంలో బాగా యూజ్ అయింది. కెమరాపనితనం సినిమాని ఏలివెట్ చేసేలా ఉంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా వంకలు పెట్టడానికి లేదు.

ట్యాగ్ లైన్:

థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులకి భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్.

Show comments