NTV Telugu Site icon

Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్-జెడి చక్రవర్తి.. ఇద్దరు రివ్యూ

Iddaru Movie Review

Iddaru Movie Review

Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. కన్నడలో కూడా ఎన్నో సినిమాలు చేశారు. అలాగే తమిళంలో కూడా వరుస సినిమాలు చేసి స్టార్ డం అందుకున్నారు. ప్రస్తుతానికి ఆయన హీరోగా చేయడం లేదు అడపాదడపా మాత్రమే అలాంటి సినిమాలు చేస్తున్నారు. అయితే కన్నడ నాట ఒప్పంద అనే సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో జెడి చక్రవర్తి మరో కీలక పాత్రలో నటించారు ఈ సినిమాని తెలుగులో ఇద్దరు పేరుతో తాజాగా రిలీజ్ చేశారు. డీఎస్ రెడ్డి సమర్పణలో ఫరీన్ నిర్మాతగా నేహా చౌదరి మరో నిర్మాతగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.

కథ విషయానికొస్తే..
సంజయ్ రంగస్వామి (అర్జున్) ఓ మల్టీ మిలియనీర్. ఆయనకు ఎన్నో కంపెనీలు నడుపుతూ ఉంటాడు. సంజయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు చక్రి(జేడీ చక్రవర్తి). అతనికి రాత్రి రాత్రే కోటీశ్వరుడు కావాలనే ఆశ ఎక్కువ. ఈ క్రమంలో అతను తన బాస్ అయిన అర్జున్ ను ఓ లేడీతో హనీ ట్రాప్ చేయాలని ట్రై చేయగా అది తెలిసి అర్జున్ మరో ప్లాన్ చేస్తాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఇద్దరి మధ్య పెద్ద చదరంగమే నడుస్తూ ఉంటుంది. ఫైనల్ గా సంజయ్ రంగస్వామిని చక్రి ట్రాప్ చేయగలిగాడా? చక్రి ఉచ్చులో సంజయ్ రంగస్వామి ఇరుక్కున్నాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.

విశ్లేషణ:
హనీ ట్రాప్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ మీడియాలో వినిపిస్తున్న పదం. ఎక్కువగా డిఫెన్స్ రంగాల్లో ఉన్న అధికారులను ట్రాప్ చేసి వారి నుంచి రహస్యాలు రాబట్టే ప్రక్రియ ఇప్పటికే ఫేమస్. ఇక ఈ సినిమాలో కూడా దర్శకుడు సమీర్ కథను ఇద్దరు ఇంటెలిజెంట్ వ్యక్తుల మధ్య జరిగిన ఎత్తుకు పై ఎత్తుల నేపథ్యంలో తెరకెక్కించాడు. ఎన్నో వేల కోట్లకు అధిపతి అయిన అర్జున్ ను హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలనుకున్న అతని కంపెనీలో పనిచేసే జేడీ చక్రవర్తి ఎలాంటి ఎత్తులు వేశాడు? అతని ఎత్తులను పసిగట్టి అతనికి పైఎత్తులు సంజయ్ ఎలా వేశాడు? అనే విషయాలను కాస్త ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పటిదో అనే విషయం ఈజీగా అర్థమయిపోయేలా ఉంది అది కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా దర్శకుడు తాను ఎంచుకున్న కథకు అదే తరహా కథనంతో మెప్పించడానికి ప్రయత్నం చేసి చాలావరకు సక్సెస్ అయ్యాడు. కొన్ని లాజిక్కు లేని సీన్స్ పక్కన పెడితే అక్కడక్కడ బోర్ కొట్టించినా.. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో గట్టిగానే ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తి సినిమాపై పెంచడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు..

నటీనటుల విషయానికొస్తే..
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో అదర్కొట్టాడు. జేడీ చక్రవర్తి కూడా తన పాత్రకు న్యాయం చేసి ఢీ అంటే ఢీ అనేలా నటించాడు. మొత్తంగా ఇద్దరు సినిమాకు టైటిల్ కు తగ్గట్టు పోటాపోటీగా నటించారు. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి కుమారి స్వామి భార్య రాధిక కుమార స్వామి తన పాత్రలో ఒదిగిపోయింది. సోనీ ఛరిష్టా తన గ్లామర్ తో అలరించిందనే చెప్పొచ్చు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి అదనపు ఆకర్షణ. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది.

ఫైనల్లీ ఈ ‘ఇద్దరు’.. ఇద్దరు మహాముదుర్ల యుద్ధం

Show comments