NTV Telugu Site icon

Babu No.1 Bullshit Guy Review: కుషిత కల్లపు ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ రివ్యూ

Babu Bullshit Guy

Babu Bullshit Guy

Babu No.1 Bullshit Guy Review: బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లపు జంటగా ఒక సినిమా తెరకెక్కింది. లక్ష్మణ వర్మ దర్శకత్వంలో బాబు నెం.1 బుల్ షిట్ గయ్ పేరుతో ఈ సినిమాని డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. బజ్జీల పాపగా ఫేమస్ అయిన కుషిత కల్లపు హీరోయిన్గా చేస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అంచనాల ఏర్పడ్డాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ: బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే అప్పుడే ఇండియాలో కరోనా ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోన్న క్రమంలో ఎందుకైనా మంచిదని సిటీ ఔట్స్కట్స్ లో ఉన్న తన జిల్లాలో ఉండాలని అనుకుంటాడు. తన ప్రేయసి కుషిత(కుషిత కల్లపు)తో కలిసి అందులో ఉండాలనుకుని ఆర్నెళ్లకు సరిపడా సామాగ్రి ఏర్పాటు చేసుకుని విల్లాలో సెటిల్ అవుతారు. ఇంతలో వీరిద్దరిని కిడ్నాప్ చేసి విల్లాలో బంధిస్తారు. అలా బంధించబడిన కార్తీక్, కుషితలు ఎలా బయటపడ్డారు? వారు బంధించ బడటానికి రీజన్స్ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
లవ్ స్టోరీ లతోపాటు యాక్షన్ సినిమాలకు తెలుగులో ప్రేక్షకుల పెద్దపీట వేస్తూ ఉంటారు. అలాగే కామెడీ ప్రధానంగా సాగే సినిమాలను సైతం నచ్చితే ఏమాత్రం పక్కన పెట్టకుండా చూసేస్తూ ఉంటారు. ఈ నేపద్యంలోనే ఒక అవుట్ అండ్ డౌట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టిన సమయంలో చాలామంది ఇళ్ళకే పరిమితం అయిపోయారు. ఈ లాక్ డౌన్ నేపథ్యాన్ని సినిమాగా ఎంచుకుని ఎన్నో సినిమాలు చేశారు ఇప్పటికే. ఇప్పుడు ఈ దర్శకుడు కూడా తన ఇంటి దగ్గరకు వచ్చిన పిచ్చుకలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నట్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. దాన్ని మనుషులకు అన్వయించి ఓ అందమైన జంటను గదిలో బంధించి ఆ అందమైన బంగ్లాలో తన కుటుంబంతో కలిసి దర్జాగా జీవించడానికి ఒక వ్యక్తి వేసిన ప్లాన్ ఈ సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ ట్రాక్ తో మొదలై… సెకెండాఫ్ లో కొంత మెలోడ్రామా తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా పెట్టి ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు. దర్శకుడు లక్ష్మణ్ వర్మ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోయినా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా చివర్లో ఇచ్చే మెసేజ్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే అర్జున్ కల్యాణ్, కుషిత జంటగా యూత్ని ఆకట్టుకునేలా ఉన్నారు. ఎప్పుడూ ఇన్ స్టాలో కుషిత అందాలు చూసిన వారికి ఈ సినిమా ఒక రకమైన ఫీస్ట్. హీరో అర్జున్ కల్యాణ్ తన పరిధి మేరకు నటించి మెప్పించారు. అప్పుడే అమెరికాలో చదువుకుని వచ్చిన కుర్రాడిగా సరిగ్గా సెట్ అయ్యాడు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ కూడా సినిమాలో హీరో సమాన స్థాయి రోల్ లో అనూహ్యంగా మెరిశారు. ఆయనకు జంటగా సోనాలి పాణిగ్రాహి నటించి ఆకట్టుకుంది. కమెడియన్ భద్రం, జబర్దస్థ్ అప్పారావులు నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకుంటారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది.పవన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. నిర్మాత దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఓవరాల్ గా ‘బాబు నెం.1 బుల్ షిట్ గాయ్’ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తాడు, కామెడీ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా నచ్చొచ్చు.

Show comments