NTV Telugu Site icon

Alluri Review: అల్లూరి మూవీ రివ్యూ

Alluri

Alluri

Alluri Review:హీరో శ్రీవిష్ణు గత సంవత్సరం మూడు చిత్రాలతో సందడి చేసినా ‘గాలి సంపత్’గాను, ‘అర్జున ఫల్గుణ’ తోనూ ఆకట్టులేక పోయాడు. అయితే ‘రాజ రాజ చోర’గా మాత్రం సక్సెస్ చూశాడు. ఈ యేడాది ‘భళా తందనాన’ అన్నా జనం మాత్రం బోరుమన్నారు. ఈ నేపథ్యంలో అతని ఆశలన్నీ ‘అల్లూరి’పైనే ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావటంతో కాస్త హైప్ వచ్చింది. అయినా ఎందుకో ఏమో ఫైనాన్స్ సమస్యల వల్ల శుక్రవారం కాస్త లేటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికి వస్తే.. సిన్సియర్ పోలీస్ గా కెరీర్ ప్రారంభించి తన సిన్సియారిటీతో పలు బదిలీలను ఎదుర్కొంటూ ప్రతి చోటా తనదైన ముద్ర వేస్తాడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అల్లూరి రామరాజు (శ్రీవిష్ణు). ఈ నేపథ్యంలో సొంత డిపార్ట్ మెంట్ తో పాటు రాజకీయనాయకుల అరాచకాన్ని ఫేస్ చేస్తాడు. నిజాయితీతో ముందుకు సాగుతాడు. చివరికి టెర్రరిజాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని కన్నుమూస్తాడు. పోలీస్ గా ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చి ఆదర్శంగా నిలిచిన పోలీస్ ఆఫీసర్ కథ ఇది.

నిజానికి మన టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ జానర్స్ లో పోలీస్ ఒకటి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో ఆకర్షణీయమైన కథలతో సినిమాలు తీసిన వారిని విజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. అయితే తలా తోక లేని కథాంశంతో పోలీస్ సినిమా తీస్తే మాత్రం పరాజయం తప్పదు. ‘అల్లూరి’ ఆ కోవకు చెందిన చిత్రమే. ప్రచారంలో హీరో శ్రీవిష్ణు పోలీస్ బయోపిక్ అన్నారు. అయితే తను అలా ఎందుకు చెప్పాడో అర్థం కాదు. అసలు కథలో ఏముందని నమ్మి సినిమా తీశారో వారికే తెలియాలి. పోలీస్ ఆఫీసర్ రామరాజుగా శ్రీవిష్ణు తన మేకోవర్ తో పాటు నటనతోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కయదు లోహర్ పాటలకే పరిమితం. మిగిలిన వారిలో తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్ తమ పాత్రలలో ఒదిగి పోయారు. సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేదు.

ప్లస్ పాయింట్స్
శ్రీవిష్ణు నటన
నిర్మాణ విలువలు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్
కథ, కథనం
సన్నివేశాల సాగదీత
పాటలు

రేటింగ్: 2/5

ట్యాగ్ లైన్: ఆకట్టుకోని ‘అల్లూరి’