South India Shopping Mall : దక్షిణాది రాష్ట్రాల సంప్రదాయాలతో, ఆధునిక జీవనశైలిని కలబోసి కుటుంబంలోని అన్ని తరాల అభిరుచులనూ మేళవించిన, సరికొత్త వస్త్ర జగత్తు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 2025 ఆగస్టు 2న శ్రీకాకుళం, జిటి రోడ్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని సరికొత్త వస్త్ర వైవిధ్యంతో అలరించింది.
ఈ సందర్భంగా శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు; శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, భారత పౌర విమానయానశాఖ మంత్రివర్యులు: శ్రీ గోండు శంకర్ గారు, శ్రీకాకుళం శాసనసభ సభ్యులు: శ్రీ కూన రవికుమార్ గారు, ఆముదాలవలస శాసనసభ సభ్యులు: శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు, మాడుగుల శాసనసభ సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేసి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్ అధినేతలను అభినందించారు.
ఆహూతుల కరతాళధ్వనుల మధ్య ప్రముఖ సినీతార నిధి అగర్వాల్ (హరిహర వీరమల్లు ఫేమ్) గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. సౌత్ ఇండియా షాపింగామాల్లో పవిత్ర శ్రావణమాస కొనుగోళ్లకు పెద్దఎత్తున వచ్చిన సంప్రదాయ మరియు ఫ్యాషన్ ప్రియులందరికీ గుర్తుండి పోయేలా షాపింగ్ మాల్ నిర్వాహకులు కన్నులవిందైన ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి, ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియా షాపింగ్మాల్ బ్రాండ్ స్థాయిని రెట్టింపు చేశారు. ముఖ్యంగా పవిత్ర శ్రావణమాసంలో తెలుగువారి ముంగిళ్ళలో జరిగే వరలక్ష్మీ పూజలు, వివాహాది కుటుంబ వేడుకలను దృష్టిలో ఉంచుకుని అన్ని తరాలను, తరగతులను అలరించే లక్షలాది వైవిధ్యభరిత వస్త్రశ్రేణి ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం.
ఈ శుభసందర్భంగా, స్థానికులకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్లు శ్రీ సురేశ్ సీర్ణ, శ్రీ అభినయ్, శ్రీ రాకేశ్, శ్రీ కేశవ్ గార్లు స్వాగతం! పలికారు. అదే సమయంలో శ్రీకాకుళం పరిసర ప్రాంత వస్త్రప్రియుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని విశేష సేవలు అందిస్తున్న సౌత్ ఇండియా. షాపింగ్ మాల్ వారి అంకితభావాన్ని ప్రశంసిస్తున్న కొనుగోలుదారులందరికీ సంస్థ డైరెక్టర్లు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు..
సంస్థ డైరెక్టర్ శ్రీ సురేశ్ శీర్ణ మాట్లాడుతూ- “శ్రీకాకుళంలో మా సౌత్ ఇండియా షాపింగ్మాల్ షోరూమ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం. దీనికి శ్రావణమాసం తోడు కావటం మాకెంతో ఆనందదాయకం. శ్రీకాకుళవాసులు కోరుకునే నాణ్యతకు, సవ్యత్వానికీ పెద్దపీట వేసి, వారి అభిరుచులను ప్రతిబింబించే వస్త్రశ్రేణిని, షాపింగ్ అనుభూతిని ఒకేచోటకు తీసుకురావటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం” అన్నారు.
సంస్థ మరో డైరెక్టర్ శ్రీ అభినయ్ మాట్లాడుతూ- “రాబోయే పండుగలు-వివాహాది శుభకార్యాలకు, భారతీయ సంప్రదాయ కలెక్షన్లకు తమ షోరూమ్ విశేషమైన కేంద్రంగా, ఆకర్షణీయ షాపింగ్ గమ్యస్థానంగా కొనుగోలుదారులు తప్పక అభిమానిస్తారని” అన్నారు.
స్థానిక వస్త్రాభిమానులను స్వాగతిస్తూ మరో డైరెక్టర్ శ్రీ రాకేశ్, “శ్రీకాకుళంలోనే అతిపెద్ద షోరూమైన మన సౌత్ ఇండియా షాపింగ్మీల్లో అన్నిరకాల వస్త్రాలు- ధరలోనూ, నాణ్యతలోనూ వస్త్రప్రియుల అభిరుచులకు అనుగుణంగా, వారిని అలరించడంలో తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అన్నిరకాల ఆదాయవర్గాల వారికీ అందుబాటులో ఉండటం వీటి ప్రత్యేకత” అన్నారు.
సంస్థకు చెందిన ఇంకో డైరెక్టర్ శ్రీ కేశవ్ మాట్లాడుతూ, “వైవిధ్యభరితమైన వస్త్రాలతో సౌత్ ఇండియా షాపింగ్మాల్ షోరూమ్ను సుసంపన్నం చేయటం మాకు గర్వకారణం, ఆనందకరం, స్థానిక కొనుగోలుదారుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం సంతోషదాయకం. వారు కోరుకునే ప్రతి వెరైటీని అందించేందుకు మేము ఆసక్తితో ఎదురు చూస్తున్నాం” అన్నారు.
ఈ పెళ్లిసీజన్లో మీరు అద్భుతంగా కనిపించేందుకు అత్యుత్తమ కలెక్షన్లను మేము సిద్ధం చేశాం. ముఖ్యంగా పెళ్ళికుమార్తెల కోసం మా వద్ద ఉన్న ప్రత్యేక మగ్గాలపై చేసిన పట్టుచీరల కళాత్మకతను చూడాల్సిందే. జీవితంలో గుర్తుండిపోయే మధురక్షణాల కోసం వాటిని మీరు సరసమైన ధరలకు సొంతం చేసుకుంటారు. అలాగే పెళ్లికుమారుల కోసం మాపద్దనున్న ఎత్నిక్వేర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే పెళ్లికి వచ్చే అతిథుల కోసం విస్తృత శ్రేణి కలెక్షన్లతో పాటు పెట్టుబడి చీరలు మా ప్రత్యేకత, మరి ఆలస్యం దేనికి? వెంటనే మా వద్దకు విచ్చేయండి. మనోహరమైన దుస్తుల్లో మంగళవాద్యాల నేపథ్యాన్ని సుసంపన్నం చేసుకోండి.
శ్రీకాకుళం, జిటి రోడ్లో అందంగా ముస్తాబై, అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ షోరూమ్ను సందర్శించిన ప్రతి ఒక్కరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ శాఖలను విస్తరించటంతో బాటుగా రీటైల్ రంగంలో ధర, నాణ్యతలకు సంబంధించి సరికొత్త, సమున్నత ప్రమాణాలను సైతం పెంపొందిస్తూ, నేతృత్వ లక్షణాలతో అగ్రగామిగా నిలుస్తోందనీ, రాబోయే పండుగలు-వివాహాది శుభాకార్యాలకు వస్త్రాభిమానులకు ఇది వినూత్న గమ్యం కాగలదని ప్రశంసించారు.
