Site icon NTV Telugu

Rainbow Childrens Hospital: జన్యు చికిత్సను 8వసారి విజయవంతం చేసిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం..!

Rainbow

Rainbow

Rainbow Childrens Hospital: భారతదేశంలో పిల్లలు, ప్రసూతి, గైనకాలజీ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్‌లో ఒక చిన్నారికి విజయవంతంగా జన్యు చికిత్సను అందించింది. ఈ చిన్నారికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ చికిత్సను ఆసుపత్రిలో ఎనిమిదోసారి నిర్వహించారు. దీంతో పీడియాట్రిక్ ఆరోగ్య సంరక్షణలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ చికిత్స రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్‌లోని కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి పర్యవేక్షణలో జరిగింది.

చికిత్సా విధానంలో భాగంగా, ఆ చిన్నారికి జోల్జెన్స్మా అనే మందును ఇచ్చారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) వ్యాధికి చికిత్స చేయడానికి దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ వ్యాధికి కారణమైన SMN1 జన్యువును ఇది సరిచేస్తుంది. జోల్జెన్స్మాను ఒక ప్రత్యేకమైన వైరల్ వెక్టర్ (అడెనో-అసోసియేటెడ్ వైరల్ వెక్టర్) ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. ఈ చికిత్స ద్వారా, మోటార్ న్యూరాన్‌లు జీవించడానికి మరియు కండరాల పనితీరుకు అవసరమైన SMN ప్రొటీన్ ఉత్పత్తి అవుతుంది. ఒక డోస్‌కు సుమారు రూ.14 కోట్లు ఖర్చయ్యే జోల్జెన్స్మా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన చికిత్సలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10,000 మంది పిల్లలలో సుమారు ఒకరిని ప్రభావితం చేసే ఒక తీవ్రమైన జన్యుపరమైన నరాల కండరాల సంబంధిత వ్యాధి. భారత్‌లో ఈ వ్యాధితో దాదాపు 1000 మంది పిల్లలు బాధపడుతున్నట్లు అంచనా. సకాలంలో చికిత్స అందించకపోతే, ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాధి వేగంగా ముదురుతూ ఉండటం వల్ల శిశువులు రెండేళ్లకు మించి బతకట్లేదు.

దేశంలోని కొన్ని ప్రత్యేకమైన ఆసుపత్రుల్లో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ ఒకటి. ఇలాంటి అత్యాధునిక జన్యు చికిత్సలను అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, బహుళ విభాగాల నైపుణ్యం మరియు అనుభవంతో కూడిన వైద్యులు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జోల్జెన్స్మా చికిత్సను అందించడానికి అవసరమైన అనుభవం, బహుళ విభాగాల బృందం ఉన్న ఏకైక ఆసుపత్రి కూడా ఇదే. చికిత్స అందించిన తర్వాత, బాధిత పిల్లలకు నిపుణులైన వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. అలాగే ఏవైనా దుష్ప్రభావాలను గుర్తించడానికి మరియు సకాలంలో వైద్యం అందించేందుకు వారానికోసారి ప్రయోగశాల పరీక్షలు నిర్వహిస్తారు.

తండ్రి భావోద్వేగం…

చికిత్స విజయవంతమైన చిన్నారి తండ్రి వినీత్ చౌదరి భావోద్వేగానికి గురయ్యారు. “ఈ చికిత్స మా కుటుంబానికి కొత్త ఆశను ఇచ్చింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బృందం చూపిన వృత్తిపరమైన విధానం, మద్దతు, అంకితభావానికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞులం. చికిత్స విజయవంతం కావడానికి ముందుకు వచ్చిన శ్రేయోభిలాషులు మరియు దాతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఈ మైలురాయి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నిబద్ధతను తెలియజేస్తుంది. అరుదైన మరియు ప్రాణాంతక పరిస్థితులతో బాధపడుతున్న పిల్లలకు నాణ్యతతో కూడిన, సంరక్షణను, అధునాతన చికిత్సలకు అందించడంపై రెయిన్‌బో చిల్డ్రన్ ఆసుపత్రి నిరంతరం దృష్టి సారిస్తుంది.

రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గురించి:

1999లో స్థాపించబడిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, పిల్లలు, శిశువులు మరియు మాతృసేవల విభాగాల్లో అగ్రగామిగా పేరుగాంచింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం సహా 6 ప్రధాన నగరాల్లో 19 ఆసుపత్రులు, 4 క్లినిక్స్ నడుపుతూ, Rainbow Children’s Hospital మరియు BirthRight by Rainbow బ్రాండ్లతో సేవలు అందిస్తోంది. 2023లో Outlook Health Awards ద్వారా దేశంలో నెం.1 ఆసుపత్రిగా గుర్తింపు పొందింది.

🌐 Website: www.rainbowhospitals.in
📧 Media Queries: media@rainbowhospitals.in
📞 Contact: +91-8978673555

Exit mobile version