Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం

  • 'జనని డైలాగ్స్ – 2026'
  • భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
  • హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, హన్మకొండలో విజయవంతంగా 'జనని డైలాగ్స్'
Oasis Fertility

Oasis Fertility

సంతానోత్పత్తి ఆరోగ్యం, ముందస్తు అవగాహన, సమాచారంతో కూడిన కుటుంబ నిర్మాణంపై ప్రజల్లో చైతన్యం కల్పించే లక్ష్యంతో ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ‘జనని డైలాగ్స్ – 2026’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, హన్మకొండ నగరాల్లో విజయవంతంగా నిర్వహించింది. “ది పేరెంట్‌హుడ్ పారడాక్స్ – బిల్డింగ్ ఎ ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఇండియా” అనే అంశంపై నిర్వహించిన ఈ జాతీయ స్థాయి చర్చలో ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, మనస్తత్వవేత్తలు, హెచ్‌ఆర్ నాయకులు, శిశు సంక్షేమ నిపుణులు, పునరుత్పత్తి వైద్య నిపుణులు పాల్గొని భారతదేశంలో కుటుంబ నిర్మాణం ఎదుర్కొంటున్న సవాళ్లపై విస్తృతంగా చర్చించారు.

హైదరాబాద్‌లో జరిగిన ప్రధాన చర్చను విశాఖపట్నం, విజయవాడ, హన్మకొండతో పాటు పలు నగరాలకు ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే జాతీయ చర్చా వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు.

భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) జనాభా భర్తీ స్థాయి కంటే తగ్గడం, ఆలస్యంగా తల్లిదండ్రులుగా మారడం, కెరీర్, ఆర్థిక ప్రణాళిక, జీవనశైలి మార్పులు వంటి అంశాలు కుటుంబ నిర్మాణంపై చూపుతున్న ప్రభావాన్ని నిపుణులు విశ్లేషించారు. సకాలంలో అవగాహన, ముందస్తు పరీక్షలు, సరైన వైద్య సలహాలతో అనేక సంతానోత్పత్తి సమస్యలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకురాలు, మెడికల్ డైరెక్టర్ డా. దుర్గా జి. రావు మాట్లాడుతూ.. “భారతదేశంలో కుటుంబ నిర్మాణం కోసం ప్రణాళిక రూపొందించడం క్రమంగా క్లిష్టమవుతోంది. కుటుంబం ఏర్పాటు చేసుకోవాలనే ఆసక్తి తగ్గడం కారణం కాదు. జీవసంబంధ కాలపరిమితి, పిల్లల పెంపకానికి అయ్యే వ్యయం, ఆధునిక ఉద్యోగ జీవిత ఒత్తిళ్లు పరస్పరం విభిన్న దిశల్లో ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కుటుంబాలు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం, వైద్య నిపుణులు, ఉద్యోగదాతలు, మనస్తత్వవేత్తలు, సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే లక్ష్యంతో జనని డైలాగ్స్‌ను నిర్వహిస్తున్నాం.” అని తెలిపారు.

ఈ సందర్భంగా భారతదేశంలో పునరుత్పత్తి వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘ఒయాసిస్ అకాడమీ’ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణలు, క్లినికల్ నాలెడ్జ్ షేరింగ్, వైద్య నిపుణులకు ప్రత్యేక శిక్షణ, జాతీయ-అంతర్జాతీయ శాస్త్రీయ సహకారాన్ని ప్రోత్సహించడం ఈ అకాడమీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. ఇప్పటివరకు 250 మందికి పైగా క్లినిషియన్లు, 200 మందికి పైగా ఎంబ్రియాలజిస్టులకు శిక్షణ అందించిన ఒయాసిస్ అకాడమీ, ముఖ్యంగా టియర్-2, టియర్-3 నగరాల్లో మరింత విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.

విశాఖపట్నం రీజినల్ మెడికల్ హెడ్ డా. రాధిక పొట్లూరి మాట్లాడుతూ, ప్రారంభ దశలోనే సంతాన సాఫల్యంపై అవగాహన పెంచుకోవడం, సరైన సమయంలో సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మెరుగైన పునరుత్పత్తి ఆరోగ్య ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఒయాసిస్ అకాడమీ ద్వారా వైద్య నిపుణులకు శిక్షణ అందించడం వల్ల ప్రాంతీయ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు. విజయవాడ రీజినల్ మెడికల్ హెడ్ డా. వెంకట సుజాత వెల్లంకి మాట్లాడుతూ, ప్రతి జంటకు నాణ్యమైన సంతాన సాఫల్య సేవలు అందుబాటులోకి రావాలంటే వైద్య నిపుణుల శిక్షణ, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధిపై నిరంతర పెట్టుబడులు అవసరమని చెప్పారు. ఈ దిశగా ఒయాసిస్ అకాడమీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

హన్మకొండ రీజినల్ మెడికల్ హెడ్ డా. జలగం కావ్యా రావు మాట్లాడుతూ, యువతలో సంతాన సాఫల్యం, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, సరైన సమయంలో వైద్యులను సంప్రదించే అలవాటు పెరగడం ఎంతో ముఖ్యమన్నారు. ముందస్తు అవగాహన, నిరంతర వైద్య విద్య, సమయానుకూల వైద్య సలహాలు ద్వారా మరింత మంది దంపతులు తల్లిదండ్రులయ్యే అవకాశాలను మెరుగుపరచవచ్చని తెలిపారు.

జనని డైలాగ్స్ అనేది ఐవీఎఫ్ లేదా ఫెర్టిలిటీ చికిత్సల ప్రచార కార్యక్రమం కాదని ఒయాసిస్ ఫెర్టిలిటీ స్పష్టం చేసింది. కుటుంబ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్థిక, వైద్య, ఉద్యోగ, సామాజిక అంశాలపై చర్చించి, ప్రభుత్వం, ఆరోగ్యరంగం, ఉద్యోగదాతలు, సమాజం కలిసి పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రజా ప్రయోజన వేదికగా ఇది కొనసాగుతుందని పేర్కొంది.

కార్యక్రమం ముగింపులో ‘జనని డిక్లరేషన్’ను విడుదల చేశారు. జీవితకాల పునరుత్పత్తి ఆరోగ్యం, సమాచారంతో కూడిన నిర్ణయాలు, ఉమ్మడి బాధ్యత, తల్లిదండ్రులుగా మారే ప్రతి మార్గానికి గౌరవం, వృత్తి–కుటుంబ సమతుల్యత, కుటుంబ స్నేహపూర్వక భారత నిర్మాణానికి సామూహిక నిబద్ధత అనే ఆరు మార్గదర్శక సూత్రాలను ఇందులో ప్రకటించారు.

ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి

2009లో ప్రారంభమైన ఒయాసిస్ ఫెర్టిలిటీ, దేశవ్యాప్తంగా 40కి పైగా కేంద్రాలతో సేవలందిస్తున్న ప్రముఖ సైన్స్ ఆధారిత పునరుత్పత్తి ఆరోగ్య సంస్థ. ఐవీఎఫ్, ఐయూఐ, ఐసీఎస్‌ఐ, CAPA-IVM, PGT-A, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి సమగ్ర సేవలను ఆధునిక ఎంబ్రియాలజీ ల్యాబ్‌లతో అందిస్తోంది. వైద్య సేవలతో పాటు ప్రజల్లో అవగాహన, పరిశోధన, వైద్య నిపుణుల శిక్షణ ద్వారా భారతదేశ పునరుత్పత్తి ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ కీలక పాత్ర పోషిస్తోంది.