NTV Telugu Site icon

APTA : సెప్టెంబర్ లో ఆప్తా నేషనల్ కాన్ఫరెన్స్

Aftha Conference

Aftha Conference

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (ఆప్తా) ఏర్పాటుచేసి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆప్తా అధ్యక్షులు ఉదయ భాస్కర్ కొట్టే తెలిపారు. ఆప్తా నూతన కార్యవర్గం అట్లాంటాలో సమావేశమై 2023-2024 రోడ్ మ్యాప్ పై చర్చించిదన్నారు. ఈ సందర్భంగా అట్లాంటాలో పలు వేదికలను నిర్వాహకులు పరిశీలించారు. సెప్టెంబర్ లాంగ్ వీకెండ్ లో నిర్వహించే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుండి మెగాస్టార్ చిరంజీవి, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, సాహిత్య కళాకారులను ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. ఆప్తా కార్యవర్గ సమావేశంలో బోర్డు చైర్ సుబ్బు కోట, ఆప్తా పూర్వ అధ్యక్షులు, ఇతర బోర్డు సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అట్లాంటా ఆప్తా ప్రముఖులు పాల్గొన్నారు.