Munugode ByPoll : హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ కు పాఠాలు నేర్పిందా ? బై ఎలక్షన్ విషయంలో రాజకీయ పార్టీగా ఎటువంటి తప్పిదాలు చేయకూడదో గులాబీ పార్టీకి బోధపడిందా ? అందుకే మునుగోడు బై ఎలక్షన్ పై టిఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేయాలనుకుంటుందా ? ఇప్పటిదాకా గులాబీ పార్టీ సైలెంట్ గా ఉండటం అందుకేనా?
మునుగోడు అసెంబ్లీ నియెజకవర్గానికి త్వరలో బై ఎలక్షన్ రాబోతుంది.వచ్చే ఏడాది షెడ్యూలు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకు బోతున్నాయి.ఇటు అధికార టిఆర్ఎస్ ఈ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది .ఈ బై ఎలక్షన్ లో గెలవడం ద్వారా తమకు తిరుగులేదని నిరుపించుకోవాలనుకుంటుంది గులాబీ పార్టీ .అయితే గతంలో దుబ్బాక,హుజురాబాద్ ఉప ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్న టిఆర్ఎస్, మునుగోడు విషయంలో కాస్తా భిన్నంగానే ముందుకు సాగనుంది అన్న గుసగుసలు ఇప్పుడు మొదలయ్యాయి.ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో చేసిన తప్పిదాలు …మునుగోడు విషయంలో రీపిట్ కావోద్దన్న అలోచనతో గులాబీ పార్టీ ఉందట.
హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో గులాబీ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది .ఉప ఎన్నిక కంటే ముందు గులాబీ పార్టీ ఒక రకంగా రాజకీయ దండయాత్ర చేసిందన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందు నియెజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు తిష్ట వేయడం …మరోవైపు భారీగా అభివృద్ది కార్యక్రమలకు శ్రీకారం చుట్టింది .ఇటు వరుసగా హుజురాబాద్ అసెంబ్లీ నియెజకవర్గంలో మంత్రులు పర్యటనలు చేసారు .ఇక పార్టీ పరంగా నామినేటేడ్ పదవులు పందేరానికి దిగింది టిఆర్ఎస్ .భారీగా హమీలు ఇవ్వడం …మరి కొన్ని వెంట వెంటనే అమలు చేయడం …హుజురాబాద్ లో టిఆర్ఎస్ భారీగా హంగామా చేసిందన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.ఇవన్నీ కూడా బై ఎలక్షన్ లో టిఆర్ఎస్ కు మేలు చేసే కంటే కీడే ఎక్కువ చేసిందని ఎన్నికల ఓటమి విశ్లేషణలో టిఆర్ఎస్ నేతలు తేల్చారట .దీనితో మునుగోడు ఉప ఎన్నికల విషయంలో అచితూచి అడుగులు వేసేందుకు గులాబీ పార్టీ మొగ్గు చూపుతుందట .
మునుగోడు ఉప ఎన్నిక త్వరలో రాబోతుంది .అధికార టిఆర్ఎస్ ఎటువంటి హంగామా లేకుండా బై ఎలక్షన్ ను ఎదుర్కోవాలన్న అలోచనతో ఉందట.ఇప్పటికే అటు కాంగ్రెస్ ,ఇటు రాజగోపాల్ రెడ్డి హడావుడి మొదలుపెట్టినా టిఆర్ఎస్ ఆ పరిణామాలను గమనిస్తుందట .పార్టీ నేతలతో ఇప్పటి వరకు మునుగోడుపై ఒక్క సమావేశం పెట్టకపోవడం అందుకు సంకేతమేన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.మునుగోడు బై ఎలక్షన్ ను సాధారణంగానే ఎదుర్కోవాలని …ఎక్కువ హడావుడి వద్దన్న అలోచనతో గులాబీ పార్టీ ఉందట .ఇప్పటికే మునుగోడు పరిస్థితులపై అంచనాకు వచ్చిన టిఆర్ఎస్ …ఒక ప్లాన్ తో ఉప ఎన్నికకు సిద్దం కావాలని అనుకుంటుందట.
హుజూర్ నగర్ ,నాగార్జున సాగర్ లో వ్యవహరించినట్టే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో వ్యవహరించాలన్న అలోచనకు గులాబీ పార్టీ వచ్చిందట .రానున్న రోజుల్లో మునుగోడు ఉప ఎన్నికపై టిఆర్ఎస్ వ్యూహాలు మరింత స్పష్టం కానుంది.