Site icon NTV Telugu

Errabelli Pradeep Rao : గులాబీకి వరుసగా గుడ్ బై చెప్తున్న నేతలు

Trs

Trs

Errabelli Pradeep Rao :

పోతేపోని….వస్తేరానీ అంటూ గులాబీ పార్టీ ఎందుకు ప్రశాంతంగా రాగాలు తీస్తోంది? కారు దిగేవారిని ఎందుకు ఆపడం లేదు? ఓవర్ లోడ్ అయినందుకే, లౌడ్ స్పీకర్ వెయ్యడం లేదా?

టిఆర్ఎస్ నుంచి ఈ మధ్యకాలంలో నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ కు ఎప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో ఏదో కారణంలో టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టిఆర్ఎస్ ను వీడుతున్న నేతలను ఆపేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా…లేదా..చూసిచూడనట్టు వ్యవహరిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో కూడా ఏదైనా అసంతృప్తితో ఎవరైనా నేతలు పార్టీని వీడితే లైట్ తీసుకుంటారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటివలే రాష్ట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ప్రదీప్ రావు బిజేపిలోకి చేరేందుకు సిద్దం అవుతున్నారట. టిఆర్ఎస్ తనకు పదవి ఇవ్వడంపై హామీ ఇచ్చిందని …దాన్ని నిలబెట్టుకోలేదన్న ఆరోపణ చేస్తున్నారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేయాలనుకుంటున్న ప్రదీప్ రావు ను బుజ్జగించే ప్రయత్నం టిఆర్ఎస్ చేసింది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంప్రదింపులు జరిపినా, ప్రదీప్ రావు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.

ఇక రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన రాజయ్య యాదవ్ కూడా ఇటివలే పార్టీని వీడారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి కాలం పూర్తి అయిన తర్వాత మళ్లీ రాజయ్య యాదవ్ కు ఛాన్స్ రాలేదు. తనకు పదవి ఇచ్చే విషయంలో టిఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆరోపించి పార్టీని వీడారు రాజయ్య యాదవ్ . రాజయ్య యాదవ్ ను బుజ్జగించేందుకు టిఆర్ఎస్ ప్రయత్నాలు చెయ్యలేదట…విజువల్స్

ఆ మద్య కాలంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్ విజయారెడ్డి కూడా టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తనకు, పార్టీకి తగిన గుర్తింపు లేదన్న వాదనను వినిపించిన విజయారెడ్డి…కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్పొరేటర్ విజయా రెడ్డిని పార్టీలోనే కొనసాగేలా టిఆర్ఎస్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న వాదనలు ఉన్నాయి.

ఒకవైపు కొందరు పార్టీ వీడుతుంటే, ఆసమ్మతి స్వరాలు కూడా బయటపడుతున్నాయి. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ఆసమ్మతి స్వరం వినిపించారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు మురళీ యాదవ్ . అసమ్మతి స్వరం వినిపించిన మురళి యాదవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టిఆర్ఎస్.

వచ్చే ఏడాది షెడ్యూలు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. నేతల్లో చాలామంది ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారే. దీంతో అందరికీ అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి …డిమాండ్ లతో ఉన్ననేతలు పార్టీని వీడితే నష్టం లేదన్న అభిప్రాయంలో టిఆర్ఎస్ ఉందట. మరి రానున్న కాలంలో టిఆర్ఎస్ ఇదే వైఖరితో ఉంటుందా లేక నేతలను బుజ్జగిస్తుందో చూడాలి.

 

Exit mobile version