NTV Telugu Site icon

NTV Exclusive: శ్రీకాంత్ మళ్ళీ భయ పెడతాడట!

Srikanth

Srikanth

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారు. సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్‌ రాంపాల్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు గతంలో రుద్ర మెరుపు లాంటి టైటిల్స్ వినబడిన ఇప్పుడు ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ అనే టైటిల్‌ని చిత్రబృందం కన్ఫర్మ్‌ చేసినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.. ఈ విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.

Ntv Exclusive: దేవర 2 లోకి సర్ప్రైజ్ పాత్రల ఎంట్రీ?

షూటింగ్‌ చివరిదశకి చేరుకున్న ఈ సినిమాని ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్‌ బలుసు, అశోక్‌ వర్దన్‌, కల్యాణ్‌ రామ్‌ కలిసి నిర్మిస్తున్నారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు అందిస్తున్న సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఒకప్పుడు ఫ్యామిలీ హీరో ఇమేజ్ తో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న శ్రీకాంత్ ఒక భయపెట్టే పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించాడని ఇన్సైడ్ వర్గాల సమాచారం.. శ్రీకాంత్ కెరియర్లో ఈ సినిమా కూడా ఒక మరుపురాని సినిమాగా నిలిచిపోతుందని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా కంటే ముందే శ్రీకాంత్ అఖండ లాంటి సినిమాలో కూడా తన విలనిజం పండించాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.