మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బహిష్కరణ తర్వాత.. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దేవాలయాలపై దాడులు సర్వసాధారణంగా మారాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిక్ శక్తులు చైనాతో తమ మైత్రిని పెంచుకుంటున్నాయి. దీంతో భారతదేశ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తున్నాయి.
READ MORE: Bengaluru: బెంగళూర్ బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ స్వాధీనం..
తాజాగా బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఇస్లామిక్ శక్తులతో చైనా సంబంధాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్‌లోని తీవ్రవాదులకు చైనా నిరంతరం సహాయం చేస్తోంది. దీనికి నిదర్శనం.. ఇటీవల ఫండమెంటలిస్ట్ సంస్థ జమాతే-ఇ-ఇస్లామీ నాయకులు చైనాను సందర్శిండమే. జమాతే-ఇ-ఇస్లామీ చీఫ్ డాక్టర్ షఫీకుర్ రెహమాన్‌తో సహా 9 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఐదు రోజుల పాటు చైనా పర్యటిస్తున్నారు. ఇందులో అతి పెద్ద విషయం ఏమిటంటే.. చైనా స్వయంగా జమాతే ఇ ఇస్లామిని ఆహ్వానించింది. ఇది ఛాందసవాద సంస్థతో చైనా నాయకుల రెండవ సమావేశం. అంతకుముందు.. ఢాకాలోని చైనా రాయబార కార్యాలయం ఆ సంస్థ అధిపతి, సభ్యులకు ఆతిథ్యం ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో దామాషా ప్రాతినిధ్య ఎన్నికల వ్యవస్థను అమలు చేయడం గురించి జమాతే ఇ ఇస్లామి చర్చించింది.
READ MORE: Ntv Podcast Show : జెడి లక్ష్మీనారాయణతో ఎన్టీవీ పాడ్ క్యాస్ట్ షో.. ప్రోమో చూశారా?
ఇది మాత్రమే కాదు.. జూలై 19న జరిగిన ఢాకా ర్యాలీలో జమాతే-ఇ-ఇస్లామి కూడా బంగ్లాదేశ్ తదుపరి ప్రభుత్వం, పార్లమెంట్ ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పనిచేయాలని పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ ఛాందసవాద సంస్థ ఇస్లామిక్ నిబంధనల ప్రకారం దేశాన్ని నడపాలని నిరంతరం పట్టుబడుతోంది. అటువంటి పరిస్థితిలో భారత వ్యతిరేక ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చైనా ఈ ఛాందసవాద సంస్థతో తన సంబంధాలను నిరంతరం పెంచుకుంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత వ్యతిరేక వైఖరికి పేరుగాంచిన బంగ్లాదేశ్ ఇస్లామిక్ సంస్థ జమాత్-ఇ-ఇస్లామీతో చైనా పొత్తు పెట్టుకోవడం ఒకే నెలలో ఇది రెండోసారి.
READ MORE: Ntv Podcast Show : జెడి లక్ష్మీనారాయణతో ఎన్టీవీ పాడ్ క్యాస్ట్ షో.. ప్రోమో చూశారా?
బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ ఛాందసవాదుల మూలాలు బలపడటం, చైనాతో వారి బలమైన పొత్తు బంగ్లా రాజకీయ స్థిరత్వానికి, భారతదేశానికి ఆందోళన కలిగిస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ శక్తులు బలపడటంతో, అక్కడ హిందూ మైనారిటీలపై దౌర్జన్యాలు పెరుగుతాయి. ఇది భారతదేశానికి ఇబ్బంది కలిగించవచ్చు. పొరుగు దేశాలలోని రాడికల్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా దక్షిణాసియాలో భారత ప్రభావాన్ని ఎదుర్కోవడానికి జమాత్ వంటి ఇస్లామిస్ట్ గ్రూపులను చైనా వ్యూహాత్మకంగా ఆలింగనం చేసుకోవడం ఒక పెద్ద భౌగోళిక రాజకీయ కుట్రలో భాగమని భద్రతా నిపుణులు అంటున్నారు. బీజింగ్, ఢాకాలోని రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల మధ్య పెరుగుతున్న ఈ పొత్తును భారత నిఘా, దౌత్య వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.
READ MORE: HHVM : వీరమల్లుకు ఆ రెండు జిల్లాల్లో భారీ వసూళ్లు..?
ఇదిలా ఉండగా.. ఏడాది క్రితం వరకు.. ఉగ్రవాద కార్యకలాపాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జమాతే ఇ ఇస్లామీని బంగ్లాలో నిషేధించారు. కానీ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన వెంటనే.. తాత్కాలిక ప్రభుత్వం దానిపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇప్పుడు ఈ సంస్థ బంగ్లాదేశ్‌లో చురుగ్గా మారింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ సంప్రదాయంలో ఇస్లామిక్ నియమాలను అమలు చేయాలని జమాతే ఇస్లామీ డిమాండ్ చేస్తోంది.
Ask ChatGPT
