Site icon NTV Telugu

YSRCP: జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు.. రి పోలింగ్ డిమాండ్..!

Ysrcp

Ysrcp

YSRCP urges the Election Commission: జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ జరపాలని కోరారు. ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేశారని సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర బలగాలతో ఎన్నికల నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు దొంగఓట్లు వేస్తున్నారని.. వారికి పోలీసులు సహకరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారు.. టీడీపీ నేతలు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా ఉన్నారంటూ చెబుతున్నారు.

READ MORE: CM Chandrababu: విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు తెచ్చాను

ఇది అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను బలవంతంగా కైవసం చేసుకునేందుకు చంద్రబాబు దారుణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రాన్ని రౌడీల పాలన వైపు నడిపిస్తున్నారు.. ముఖ్యమంత్రిగా తన అధికారాలను దుర్వినియోగం చేశారన్నారు.. అధికారులను తన ఆధీనంలోకి తీసుకుని, పోలీసులను మోహరించి ఎన్నికలను ఒక ఉగ్రవాదిలా హైజాక్ చేశారు.. ప్రజాస్వామ్యం దెబ్బతిన్న ఇవాళ నిజంగా బ్లాక్ డే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాల అంటూ ట్వీట్ చేశారు..

READ MORE: Yezdi Roadster 2025: 6-స్పీడ్ గేర్‌బాక్స్, 334cc సింగిల్-సిలిండర్‌తో కొత్త యెజ్డి రోడ్‌స్టర్ విడుదల!

Exit mobile version