Site icon NTV Telugu

YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

Ys Jagan Press Meet

Ys Jagan Press Meet

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మీరే రాష్ట్ర భవిష్యత్తు అంటూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Also Read: AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!

పరీక్షలకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘ఈరోజు బోర్డు పరీక్షలకు హాజరవుతున్న మా 10వ తరగతి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరే మన రాష్ట్ర భవిష్యత్తు. ఏకాగ్రతతో ఉండండి, మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. మీ శక్తివంచన లేకుండా అత్యుత్తమంగా ప్రయత్నించండి. మీ కష్టానికి తగిన విజయం తప్పకుండా దక్కుతుంది. అందరికీ గుడ్ లక్’ అని జగన్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్‌ అభ్యర్థులు 6,22,074 కాగా.. ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది ఉన్నారు.

 

Exit mobile version