Site icon NTV Telugu

YS Jagan: “హలో ఇండియా.. ఇది ఒక వేక్-అప్ కాల్”.. వైఎస్‌ జగన్ సంచలన పోస్ట్..

Jagan Ys

Jagan Ys

YS Jagan: “హలో ఇండియా.. ఇది ఒక వేక్-అప్ కాల్” అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్ చేశారు. విశాఖపట్నంలో చంద్రబాబు, ఆయన కుటుంబం దాదాపు ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోచుకుంటోందని.. రిషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం చేసి బహిరంగంగానే కబ్జా చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి రూ.5,000 కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారని చెబుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

READ MORE: Gold Silver Prices: ధరలు తగ్గడంలో ట్రంప్ హ్యాండ్! బంగారం, వెండిలో పెట్టుబడికి ఇదే సరైన సమయమా?

“విశాఖపట్నంలో చంద్రబాబు, ఆయన కుటుంబం దాదాపు ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోచుకుంటోంది. రుషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం చేసి బహిరంగంగానే కబ్జా చేస్తోంది. సీఎం చంద్రబాబు, ఈ అమూల్యమైన భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖ ఎంపీ శ్రీ భరత్‌కు అప్పగిస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ వేసిన భూములను ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన కుటుంబానికి ఉచిత బహుమతిగా ఇస్తున్నారు. ఈ విలువైన భూములను తన తోడల్లుడికి కట్టెబట్టడం ద్వారా లోకేష్‌ పాత్ర చంద్రబాబు కుటుంబ కుట్రను బయటపెడుతోంది. లోకేష్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యా శాఖ నుంచి ఒక మెమో జారీ చేసి ఈ భూములను తమ బంధువులకు కేటాయించేలా చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లు, బెదిరింపులతో గ్రేటర్‌ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను బలవంతం చేసి ఏకపక్షంగా ఆమోదించుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైసీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే, వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా బయటకు తోసేశారు.. ఈ దాడుల్లో పలువురు వైసీపీ కార్పొరేటర్లు గాయపడగా, పోలీసులు పట్టించుకోకుండా మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారు. ఈ భూ దోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు, బీసీ యాదవ వర్గానికి చెందిన వైసీపీ మహిళా మేయర్‌ను తొలగించారు.. కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి రూ.5,000 కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి. వారి కుటుంబ ఆస్తులు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పరిపాటిగా జరిగిపోతోంది.. చంద్రబాబు, నారా లోకేష్‌లు తమ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు..” అని మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version