NTV Telugu Site icon

Viral : చీరలో యువతి డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా..

Dance

Dance

ప్రస్తుతం సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోల ట్రెండ్ నడుస్తోంది. సాంగ్స్ కు అనుగుణంగా డ్యాన్స్ చేయడం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. ఈ తరహా వీడియోల్లో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీరలో ఓ యువతి.. చోలీ కే పీచే క్యా హై అనే బాలీవుడ్ పాటకు చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. ఆమె డ్యాన్స్ చేసిన తీరుకు, ఆమె టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు.

Also Read : Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. మళ్లీ చక్రం తిప్పిన చిన్నమ్మ..

ఓ కాలేజీలో ఫేర్ వెల్ లో భాగంగా స్టేజ్ పై కనికా గోపాల్ అనే యువతి డ్యాన్స్ చేసింది. పాటకు అనుగుణంగా స్టెప్పులతో, కిల్లింగ్ లుక్స్ తో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో దుమ్ము రేపింది. తగ్గేదేలే అన్నట్లుగా ఆమె డ్యాన్స్ చేసింది. ఇంకేముందు.. కనికా గోపాల్ డ్యాన్స్ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. సూపర్ గా డ్యాన్స్ చేసిందంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

Also Read : Nitin Kamat : డబ్బుతో దీన్ని కొనలేరు.. అద్భుతమై స్టోరీ చెప్పిన జెరోధా సీఈఓ

కనికా ఈ వీడియోను ఏప్రిల్ 3న తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియోకి ఇప్పటివరకు 10లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వ్యూస్ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక లక్షల సంఖ్యలో కామెంట్లు, లైకులు వచ్చాయి. తన డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో కనికా గోపాల్ ఫుల్ ఖుషీ అవుతుంది. చివరికి తాను అనుకున్న గుర్తింపు దక్కింది అని కనికా గోపాల్ సంతోషం వ్యక్తం చేసింది.

Show comments