సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో డ్యాన్స్ వీడియోలు ఎక్కువగానే ఉంటాయి.. సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకోవడం కోసం రకరకాలుగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు.. కొన్ని వీడియోలు జనాలకు పిచ్చెక్కిస్తే మరికొన్ని వీడియోలు మాత్రం జనాల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా ఓ యువకుడు మాత్రం వర్షంలో తడుస్తూ అదిరిపోయే డ్యాన్స్ వేసాడు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఎక్కడ చూసిన పుష్ప పుష్ప పాట వినిపిస్తుంది.. ఆ పాట హుక్ స్టెప్ ను అందరు తెగ ట్రై చేస్తున్నారు.. ఎవరికీ తగ్గట్లు వాళ్లు చేస్తూ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా వర్షంలో ఓ వ్యక్తి ఈ స్టెప్పును రీ క్రియేట్ చేయగా.. మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇన్ స్టాలో అతని పేరు తారక్ అని ఉంది.
సినిమాలో అల్లు అర్జున్ పాటలో భీకరమైన రూపంలో డ్యాన్స్ చేయగా.. ఈ వీడియోలో మాత్రం అతను చాలా కూల్ గా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.. తారక్ వర్షపు వీధుల్లో కూల్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో పోస్ట్‌కు వ్యూస్ తో పాటు, లైకులు కూడా వస్తున్నాయి.. మొత్తానికి అతని వీడియో ట్రెండింగ్ లో ఉంది.. ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి..