You Tuber Give life to Beggar Woman who are Speaking in English: ఓ యూట్యూబర్ చేసిన సాయంతో భిక్షాటన చేసుకునే ఓ వృద్ధురాలి జీవితం మారిపోయింది. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ చెన్నై వీధులో యాచన చేస్తున్న ఆమెను ఓ స్థానిక యూట్యూబర్ చూశాడు. ఆమెకు ఎలా అయినా సాయం చేయాలనుకున్న అతడు ఆమె గురించి వివరాలు కనుకున్నాడు. అనంతరం వాటిని ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది.
Also Read: Mobile Alert: ఫోన్ తీసుకొని టాయిలెట్లోకి వెళ్తున్నారా.. ఆ తప్పు మిమ్మల్ని నపుంసకుడిని చేస్తుంది
ఆమె కథ ఏంటంటే భిక్షాటన చేస్తన్న మెర్లిన్ బర్మాకు చెందినది. కొన్నేళ్ల క్రితం భారతీయుడిని పెళ్లాడి మన దేశానికి వచ్చేసింది. ఇప్పుడు ఆమె వయసు 81 ఏళ్లు. పెళ్లైన కొత్తలోనే ఆమె జీవితం తలకిందులు అయిపోయింది. భర్తతో సహా ఆమె కుటుంబంలోని అందరూ ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. దాంతో మెర్లిన్ ఒంటరి అయిపోయింది. ముసలి వయసులో ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేక యాచన చేసుకొని బతుకుతుంది. అయితే అంతకముందు ఆమె టీచర్ గా పనిచేసింది. ఆమె మ్యాథ్స్, ఇంగ్లీష్ పాఠాలు చెప్పేది. ఈ అన్ని విషయాలను యూట్యూబర్ మహ్మమద్ ఆషిక్ తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అయితే ప్రస్తుతం తాను కడుపు నింపుకోవడం కోసం అడుక్కుంటున్నానని, కొన్ని కొన్ని సార్లు తిండి దొరక్కా పస్తులు కూడా ఉంటున్నానని మెర్లిన్ తెలిపింది.
ఆషిక్ ఆమెకు ఓ చీరను కూడా కొని ఇచ్చాడు. అంతేకాకుండా ఆమెను టీచింగ్ వృత్తి మళ్లీ ప్రారంభించాలని కోరి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నాడు. ఆమె వీడియోలను కూడా చాలా మంది చూస్తున్నారు. ఇలా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే మెర్లిన్ ఇన్నాళ్లు భిక్షాటన చేసిందంటే ఆమె పరిస్థితి చూసి నెటిజన్లు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఆమెను గుర్తించి ఆమెకు కొత్త జీవితం అందించినందకు, ముసలితనంలో అండగా నిలిచినందుకు యూట్యూబర్ ఆషిక్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.