Site icon NTV Telugu

Yashasvi Jaiswal: జైస్వాల్‌ సెంచరీ.. గవాస్కర్ రికార్డు సమం, సచిన్ రికార్డు బ్రేక్!

Yashasvi Jaiswal Century

Yashasvi Jaiswal Century

Yashasvi Jaiswal Equals Sunil Gavaskar Record vs England: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. మూడో రోజు ఆటలో గస్ అట్కిన్సన్ వేసిన 51 ఓవర్‌లోని రెండో బంతికి సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. 127 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ సెంచరీతో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డును జైస్వాల్ సమం చేశాడు.

ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన రెండవ భారత ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. సునీల్ గవాస్కర్ ఇంగ్లండ్‌పై 4 నాలుగు సెంచరీలు బాదాడు. ఇప్పుడు జైస్వాల్ కూడా నాలుగో శతకం బాదాడు. జైస్వాల్ కేవలం 10 మ్యాచ్‌ల్లోనే 4 శతకాలు చేయగా.. గవాస్కర్ 37 మ్యాచ్‌ల్లో చేశాడు. రోహిత్ శర్మ 13 మ్యాచ్‌ల్లోనే 4 శతకాలు బాదాడు. ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్ 16 మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. జైస్వాల్, రోహిత్ శర్మ, గవాస్కర్ తర్వాతి స్థానాల్లో విజయ్ మర్చంట్ (7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు), మురళీ విజయ్ 1(1 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు) ఉన్నారు. జైస్వాల్ 23 ఏళ్ల వయసులోనే కఠినమైన పిచ్‌లపై గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు.

Also Read: Rohit Sharma: ఐదవ టెస్ట్‌కు రోహిత్ శర్మ.. వీడియో వైరల్!

23 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్‌పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత బ్యాటర్‌గా కూడా యశస్వి జైస్వాల్ నిలిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. ఇంగ్లండ్‌పై జైస్వాల్‌కు ఇది 9వ 50 ప్లస్ స్కోర్. 19 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల వయసులో సచిన్ ఇంగ్లండ్‌తో 14 ఇన్నింగ్స్‌లలో 8 50 ప్లస్ స్కోర్లు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ సచిన్‌ పేరిట ఉండగా.. జైస్వాల్ అధిగమించాడు.

Exit mobile version