NTV Telugu Site icon

YashaSri: విమెన్స్ ఐపీఎల్‌లో ఆడుతుండటం సంతోషంగా ఉంది: యశ శ్రీ

6

6

విమెన్స్ ఐపీఎల్‌ వేలంలో పలువురు తెలుగు క్రికెటర్లు సత్తాచాటారు. 19 ఏళ్ల యశశ్రీని మొదటి రౌండ్‌లో ఎవరూ తీసుకోకపోయినా.. రెండో రౌండ్‌లో ఆమెను యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.10 లక్షలకు యశశ్రీని దక్కించుకుంది. తాజాగా ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన యశశ్రీ.. తొలిసారి జరుగుతున్న విమెన్స్ ఐపీఎల్‌కు సెలెక్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ లీగ్ ద్వారా ఆటతీరును మరింత మెరుగుపర్చుకునే అవకాశం దక్కిందని చెప్పింది.

Also Read: Muralidhar Rao: బీబీసీ దుష్ప్రచారం చేసింది.. ఎటాక్ చేయకుండా ఎలా ఉంటాం?

“విమెన్స్ ఐపీఎల్‌కు ఎంపిక అవుతానని ఆశించలేదు. కాబట్టి వేలం గురించి నేను భయపడలేదు. కానీ ఆ వార్త తెలియగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. జిమ్‌లో ఉండటం వల్ల, అందరి ముందు నా భావాన్ని చెప్పలేకపోయాను. కానీ లోపల చాలా గొప్పగా ఫీలయ్యాను. మన జట్టులోని మేటి క్రీడాకారిణులు, ఇతర దేశాల క్రికెటర్స్‌తో ఆడే అవకాశం వచ్చిందని.. వారి ద్వారా మరింత ఎక్కువ నేర్చుకుంటాను. అవకాశం దొరికినప్పుడల్లా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తా. మెరుగైన ఆటతీరు కనబరిచేందుకు మరింత కష్టపడతా. మొన్ననే అండర్- 19 వరల్డ్ కప్ ఆడాను. అదే తీరుతో ఐపీఎల్‌లో ఆడతాను. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నా. యూపీ వారియర్స్ టీం చాలా బ్యాలెన్స్‌గా ఉంది. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా ఇంకా బెటర్ గేమ్ నేర్చుకోవచ్చు” అని యశ శ్రీ వెల్లడించింది.

Also Read: Vijay Shah: ‘బొక్కలు విరుగుతాయ్’..గోడు చెప్పుకొన్న వ్యక్తిపై మంత్రి చిందులు