యామి గౌతమ్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ 2010 లో ఉల్లాస ఉత్సాహ అనే కన్నడ సినిమాతో సిని ఇండస్ట్రీ కి పరిచయం అయింది.తెలుగులో రవిబాబు తెరకెక్కించిన నువ్విలా సినిమాతో పరిచయం అయింది.తెలుగులో ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ యాడ్స్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది.యామీ గౌతమ్ ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తుంది. తాజాగా ఈ భామ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఓ మై గాడ్ 2 లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఆగస్టు 11 న విడుదల అయింది. తాజాగా ఈ భామ సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమాల్లో నటించే నటీనటుల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమాలను ఎక్కువగా మార్కెటింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ కారణం వల్లనే చాలామంది నటీనటులు వారి ప్రతిభను చూపించలేకపోతున్నారని యామీ గౌతమ్ చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ కల్చర్ బాగా పెరిగిపోతుందని యామీ గౌతమ్ చెప్పుకొచ్చారు. కొంతమంది ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అవుతారు.మరి కొందరు సక్సెస్ కావడానికి ఎక్కువ సినిమాలు చేయాల్సి ఉంటుంది అని యామీ గౌతమ్ తెలిపారు.అయితే కొంతమంది మాత్రం సక్సెస్ కావడం కోసం ఎక్కువగా పబ్లిసిటీపై ఆధారపడతారని ఆమె చెప్పుకొచ్చారు.ఎవరైతే పబ్లిసిటీ ద్వారా సక్సెస్ అవ్వాలని భావిస్తారో అలాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేరని యామీ గౌతమ్ తెలిపారు..ఇటీవల విభిన్న పాత్రల్లో నటించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకోవాలని భావించే వాళ్లతో పోల్చితే పబ్లిసిటీ ద్వారా ఫేమ్ సంపాదించాలని భావించే వాళ్లు ఎక్కువగా వున్నారని ఆమె కామెంట్లు చేసింది. తాను ఎక్కువగా పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వనని ఆమె పేర్కొన్నారు.సినిమా ఇండస్ట్రీ లో ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ లు వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం యామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.