పాతబస్తీ యాకుత్‌పురా మౌలాకా చిల్లా ప్రాంతంలో మ్యాన్‌హోల్ లో పడిపోయిన చిన్నారి ఘటనపై హైడ్రా దర్యాప్తు చేసింది. బుధవారం మ్యాన్ హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం వరకు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించింది. అసలు ఏం జరిగిదంటే.. స్థానిక కార్పొరేటర్ ఆదేశాలతో మ్యాన్ హోల్ ఓపెన్ చేసి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ మట్టి తొలగించారు. జలమండలికి చెందిన జెట్టింగ్ మెషిన్ తో సిల్ట్ తొలగించారు. సిల్ట్ తొలగించిన అనంతరం మూత వేయకుండానే మరో మ్యాన్ హోల్ క్లీన్ చేయడానికి సిబ్బంది వెళ్ళింది.
READ MORE: CP Radhakrishnan: రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం..
నిన్న సాయంత్రం వచ్చిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మ్యాన్ హోల్ మూత క్లోజ్ చేయడానికి ప్రయత్నించగా.. మరింత సిల్ట్ తీయాల్సి ఉందని గమనించారు.. మ్యాన్‌హోల్ తెరిచే ఉండాలని స్థానికులు అడ్డుకున్నారని హైడ్రా తెలిపింది. దీంతో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. నగరంలో మ్యాన్ హోల్స్‌పై రేపు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులతో హైడ్రా మీటింగ్ ఏర్పాటు చేయనుంది. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంటే వెంటనే 9000113667 నంబరుకు సమాచారం అందించాని హైడ్రా ప్రజలను కోరింది. మ్యాన్ హోల్ లో సిల్ట్ క్లియర్ చేసిన అనంతరం వెంటనే మూత వేయాలని సిబ్బందికి హైడ్రా కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.
READ MORE: CM Chandrababu: కొత్త కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్.. కీలక సూచనలు
