NTV Telugu Site icon

Sangareddy: జీతాలు చెల్లించండి.. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన

Sangareddy

Sangareddy

Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరులోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన చేపట్టారు. గత ఏడాదిలో పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని కార్మికుల డిమాండ్ చేశారు. రమేష్ బాబు అనే కార్మికుడు బాయిలర్ పై ఉన్న చిమ్ని ఎక్కి జీతాలు చెల్లించాలని తీవ్ర ఆందోళన చేశాడు. జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికుడి ఆవేదన వ్యక్తం చేశారు. జీతం ఇవ్వకపోతే రమేష్ బాబు అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. అయితే అక్కడే వున్న కార్మికులందరూ రమేష్ బాబుకు నచ్చబెబుతున్నా ససేమిరా అంటూ కిందకి దిగకుండా రమేష్ జీతాలు ఇవ్వకపోతే చావే శరణ్యమంటు భీష్మించుకుని కూర్చున్నాడు.

Read also: Viral Video: 102 ఏళ్లలో కూడా కుర్రాళ్ల‌తో క్రికెట్ ఆడుతున్న క‌శ్మీరీ తాత‌..

అయితే.. కొన్ని రోజులుగా చెరకు రైతులకు బకాయిలు ఉండటంతో షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో ఫ్యాక్టరీ మూసివేస్తే కుటుంబాలతో సహా రోడ్డున పడతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పైస్థాయి అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకుని, జీతాలు ఇవ్వకుండా కార్మికులకు ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. జీతాలు ఇచ్చేంత వరకు ప్యాక్టరీ నుంచి కదిలేది లేదని అంటున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా చేతులు దులుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నారు. రోజూలాగేనే ఫ్యాక్టరీకి పనిచేసేందుకు వచ్చిన కార్మికులను బయటనే నిలబెట్టి మూసి వేస్తున్నట్లు ప్రకటించడం సబబు కాదని ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. యాజమాన్యం స్పందించి బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Dakshina : ఆసక్తి రేకేత్తిస్తున్న సాయి ధన్షిక “దక్షిణ” ట్రైలర్