ఐసీసీ మహిళా టీ20 వరల్డ్‌కప్‌నకు అంతా సిద్ధమైంది.దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ కోసం ఇప్పటికే టీమ్స్ ప్రిపరేషన్స్ పూర్తి చేసే పనిలో పడ్డాయి. మొట్టమొదటి మహిళల టీ20 వరల్డ్ కప్ 2009లో జరిగింది. ప్రస్తుతం జరగబోయేది 8వ ఎడిషన్. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో భారత్ టోర్నీని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఈ వరల్డ్‌కప్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Vani Jayaram: వాణీ జయరామ్‌కు తెలుగువారితో ‘ఎన్నెన్నో జన్మలబంధం’
ఈ టోర్నమెంట్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. మొత్తం 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్ ఐర్లాండ్ ఉన్నాయి. తమ తమ గ్రూపుల్లో తొలి రెండు ప్లేస్‌ల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్ విజేతలు ఫైనల్‌లో టైటిల్ కోసం తలపడతాయి. ఈ తుదిపోరు ఫిబ్రవరి 26న న్యూలాండ్స్‌లోని కేప్ టౌన్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ మ్యాచ్‌లు భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే..
టీమిండియా షెడ్యూల్ :
ఫిబ్రవరి 12న భారత్ vs పాకిస్తాన్
ఫిబ్రవరి 15న భారత్ vs వెస్టిండీస్
ఫిబ్రవరి 18న భారత్ vs ఇంగ్లాండ్
ఫిబ్రవరి 20న భారత్ vs ఐర్లాండ్