Site icon NTV Telugu

Robberies in Temples: గుడిలో జడ్జి మంగళసూత్రం దొంగతనం.. 10 మంది మహిళా దొంగల అరెస్టు..!

Chain Snach

Chain Snach

Robberies in Temples: ఉత్తరప్రదేశ్‌ మథురాలోని ఆలయాలలో దొంగతనాలు చేసే మహిళల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇందుకు కారణం ఓ మహిళా జడ్జి మంగళసూత్రం దొంగతనానికి గురి కావడమే. జడ్జికి చెందిన మంగళసూత్రం అపహరించబడటంతో ఘటనపై లోతైన విచారణ జరిపారు పోలీసులు. ఈ నేపథ్యంలో మొత్తం 10 మంది మహిళా దొంగలు అరెస్టు చేయబడ్డారని అధికారులు తెలిపారు.

Read Also: Tragedy : సె*క్స్‌కు ఒప్పుకోలేదు.. అందుకే చంపేశాం.. సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం కేసులో సంచలనం

ఇక అసలు విషయం ఏంటంటే.. జూన్ 1న మధ్యప్రదేశ్‌ ఉజ్జయినికి చెందిన అదనపు జిల్లా అండ్ సెషన్స్ న్యాయమూర్తి ప్రేమా సాహు తన కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధావనలోని ఠాకూర్ శ్రీ రాధారమణ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వచ్చారు. అక్కడే ఆమె బంగారు మంగళసూత్రం దొంగతనానికి గురైంది. ఈ ఘటనపై ఆ జడ్జి పోలీసులకు విషయాన్నీ తెలిపారు. దీనితో ఈ ఘటనపై స్పందించిన మథురా జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) శ్లోక్ కుమార్ మాట్లాడుతూ.. వృద్ధావన్ ప్రాంతంలోని ఆలయాల్లో చురుకుగా దొంగతనానికి పాల్పడుతున్న మహిళా దొంగలను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించామని.. ఇందులో భాగంగా తాజాగా 10 మంది మహిళా దొంగలను అరెస్ట్ చేశామని తెలిపారు.

Read Also: Michael Clarke: ఐపీఎల్ ఆడడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై విశ్వాసం.. ధోనీపై కీలక వ్యాఖ్యలు..!

అలాగే అరెస్ట్ అయిన మహిళల వద్ద నుండి పలు వ్యక్తుల పర్సులు, అందులోని డబ్బు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డెబిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఇంకా ఇతర ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.18,652 నగదును రికవర్ చేశారు. పోలీసుల విచారణలో ఈ ముఠా సభ్యులు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి వచ్చారని.. వృద్ధావన్, మథురాలోని ఆలయాల్లో జేబుదొంగతనం, ఫోన్ చోరీలు, ఆభరణాల అపహరణకు పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, అరెస్ట్ అయిన మహిళలను జైలుకు తరలించినట్లు ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ తెలిపారు. ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తామని కూడా ప్రకటించారు.

Exit mobile version