Site icon NTV Telugu

Wine Shops Close: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు షాప్స్ క్లోజ్!

Wine Shops Close

Wine Shops Close

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు, బార్లు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు నవంబర్ 14న ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు, అవసరమైతే రిపోల్ రోజు కూడా వైన్ షాప్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Lokesh Kanagaraj: లోకేష్‌తో సినిమా అవసరమా?.. బిగ్ షాక్ తప్పదా?

తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 ప్రకారం అవినాష్ మోహంతీ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతాల్లో ఉన్న అన్ని వైన్‌ షాపులు, టాడీ దుకాణాలు సహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లు మూసివేయనున్నారు. ఈ ఆదేశాలు 2025 నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు, అవసరమైతే రిపోల్ రోజు కూడా ఆంక్షలు కొనసాగుతాయి. ఈ ఆదేశాలు ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 135-C ప్రకారం జారీ చేయబడ్డాయని కమిషనర్ అవినాష్ మోహంతీ తెలిపారు.

Exit mobile version