NTV Telugu Site icon

Wifi Password: పాస్‌వర్డ్‌తో పనిలేదు.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు!

Wifi Password Tips

Wifi Password Tips

Android Smartphones Wifi Password Tips: ప్రస్తుతం చాలా మంది ఆండ్రాయిడ్‌ ఫోన్‌లనే వినియోగిస్తున్నారు. వాట్సప్‌, యూట్యూబ్‌, మ్యూజిక్, యూపీఐ, ఇన్‌స్టాలనే ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. అయితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో చాలా మందికి తెలియని ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. కొందరు అయితే వాటి జోలికే వెళ్లి ఉండరు. అలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఫీచర్‌ ‘వైఫై పాస్‌వర్డ్’. మనం పాస్‌వర్డ్‌ చెప్పకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా వైఫైని ఇతరులకు కనెక్ట్ చెయ్యొచ్చు. అదెలానో ఓసారి చూద్దాం.

అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మన వైఫై షేర్‌ చేయాల్సి వస్తుంది. వైఫై కనెక్ట్ కావాలంటే.. వచ్చిన వారికి మన పాస్‌వర్డ్‌ చెప్పాల్సిందే. లేదంటే వారి ఫోన్ తీసుకుని.. మనం ఎంటర్‌ చేయాలి. కొన్నిసార్లు ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలంటి వారికోసం ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ఆప్షన్ ఉంది. అప్పుడు పాస్‌వర్డ్‌ చెప్పాల్సిన, ఎంటర్‌ చేయాల్సిన పనిలేదు. ఇందుకోసం సెట్టింగ్స్‌కు వెళ్లాలి.

Also Read: Pakistan Cricket: మేనేజ్‌మెంట్‌ తప్పు చేసింది.. ఫాన్స్ ఏం చేస్తారో చూడాలి!

సెట్టింగ్స్‌లో కనెక్షన్స్ (Connections)కి వెళ్లి వైఫై (Wi-Fi) ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో కరెంట్ నెట్ వర్క్ (Current Network)కు వెళ్లి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ఆప్షన్ (QR code option) మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ వైఫై తాలూకా క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. పాస్‌వర్డ్‌ అడిగిన వాళ్ల ఫోన్‌ నుంచి కోడ్‌ని స్కాన్‌ చేస్తే వైఫై కనెక్ట్ అయిపోతుంది. అయితే ఈ ఆప్షన్‌ ఒక్కో మొబైల్‌లో ఒక్కో విధంగా ఉంటుంది. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ఇదే ఉంటుంది.

Show comments