Wife Killed Husband: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. చిన్న మిస్టేక్‌తో దొరికిపోయిందిగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband: ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు సినిమా స్థాయిలో కథ అల్లింది. చివరకు గుట్టురట్టు జైలు పాలైంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో వెలుగు చూసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పరిధి గుండ్లరేవుకు చెందిన భూక్య మహేష్‌తో అదే జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన లతతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల మహేష్ రెండు సార్లు పక్షవాతం వచ్చింది. దంపతులు ఆరు నెలల కిందటే కేపీహెచ్‌బీ హైదర్‌నగర్ పరిధిలోని రాంనరేష్ నగర్‌కు మారారు. విక్రమ్ అనే మరో క్యాబ్ డ్రైవర్ మహేష్ స్నేహితుడు. వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా మహేష్ రెండు సార్లు విక్రమ్‌ని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో లతపై విక్రమ్ కన్నేశాడు.
Also Read
మహేష్ లేని సమయంలో విక్రమ్ చాలాసార్లు ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో మహేష్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ ఏడాది జూన్ 22న మహేష్ కుర్చీలో కూర్చోబెట్టి ఉరివేశారు. ఆ వెంటనే మూర్ఛ వల్లే తన భర్త చనిపోయాడని భార్య లత చుట్టుపక్కల వున్న వారిని నమ్మించింది. అదే ఆమెకు దొరికిపోయేలా చేసింది. ఇంటి యజమాని దగ్గర్లోని డాక్టర్‌కి ఫోన్ చేయగా, మహేష్ పల్స్ ఇంకా కొట్టుకోవడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ జూన్ 23న మహేష్ మృతి చెందాడు. గొంతుపై గాయం ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే మహేశ్ ది హత్య అని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు లత(23)ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. ఆమె అసలు విషయం చెప్పింది. ప్రియుడు విక్రమ్‌తో కలిసి హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. అయితే లత ప్రియుడు విక్రమ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Atrocious: పోలీస్ ఉద్యోగంలో భార్య బిజీ.. బేజారై హత్యచేసిన భర్త..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!