NTV Telugu Site icon

Wi-Fi Speed: మీ వైఫై స్పీడ్ తక్కువుగా ఉందా.? ఇలా చేయండి పరిమితిలేని వేగాన్ని పొందండి..

Wifi Speed

Wifi Speed

Wi-Fi Speed Problems and Solutions: మీ స్మార్ట్‌ ఫోన్, టాబ్లెట్, స్మార్ట్ టీవీ ఇలా అనేక వాటి వినియోగంలో ఇంటర్నెట్ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వైఫై ఉపయోగం చాలా పెరిగింది. ప్రతి పరికరానికి సజావుగా పనిచేయడానికి వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం. చాలా సార్లు వైఫై సరిగ్గా పని చేయక లేక మరేదో కారణంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా ఉండదు. ఒక్కొక్కసారి వెబ్‌ సైట్ తెరవడానికి కూడా చాలా సమయం పడుతుంది. వైఫై ఇంటర్నెట్ వేగం నెమ్మదిగా మారడానికి గల కారణాలను ఓసారి తెలుసుకుందాం.

Jagga Reddy: వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా సీఎం అవుతా.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

వైఫై ఇంటర్నెట్ వేగం మీ నుండి రూటర్ దూరంపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు రౌటర్ నుండి ఎంత దూరంలో ఉంటే ఇంటర్నెట్ వేగం అంత తక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు కనెక్షన్ డ్రాప్‌ ను ఎదుర్కోవలసి రావచ్చు. ఇది కాకుండా చాలా పరికరాలను వైఫైకి కనెక్ట్ చేయడం రూటర్ పాతది కావడం వల్ల వేగం కూడా నెమ్మదిగా మారవచ్చు. మీరు అపార్ట్మెంట్ లేదా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసిస్తుంటే వైఫై సిగ్నల్‌ లో ప్రబ్లామ్స్ ను ఎదురుకుంటారు. నెమ్మదిగా ఇంటర్నెట్ వేగం సమస్య విషయంలో మీరు రూటర్‌ను 15 సెకన్ల పాటు ఆఫ్ చేసి ఆపై దాన్ని మళ్లీ ఆన్ చేయాలి. ఇది వేగాన్ని ప్రభావితం చేయవచ్చు. వైరస్‌ లు మీ పరికరంలో ఇంటర్నెట్ వేగాన్ని కూడా నెమ్మదిస్తాయి. అటువంటి పరిస్థితిలో పరికరాన్ని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌తో స్కాన్ చేయాలి. అలాగే డివైస్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌ లను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండండి. ఇంకా రూటర్ నుండి దూరంగా ఉన్నప్పుడు 5GHz బ్యాండ్ స్పీడ్‌ని ఉపయోగించడం మంచిది.

Jewelry Shop Robbery: సినిమాను తలపించేలా.. ముంబైలో ముసుగులు ధరించి నగల షాపులో చోరీ.. (వీడియో)

పాత నెట్‌వర్క్ డ్రైవర్‌లు మీ పరికరాన్ని వైఫైకి కనెక్ట్ చేయడంలో సమస్యలను కలిగిస్తాయి. మీరు వాటిని మాన్యువల్‌గా లేదా డ్రైవర్ అప్డేటర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో అప్డేట్ చేయవచ్చు. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అందించిన డిఫాల్ట్ డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS)ని ఇతర DNS సెట్టింగ్‌ లకు మార్చడం ద్వారా మీరు ఇంటర్నెట్ వేగం, నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచవచ్చు. వైఫైకి కనెక్ట్ చేయబడిన పెద్ద సంఖ్యలో పరికరాలను డిస్‌ కనెక్ట్ చేయడం ద్వారా కూడా మెరుగుదలను చేయవచ్చు.

Show comments