Site icon NTV Telugu

Gaza Conditions: గాజాలో దారుణ పరిస్థితులు.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌ భావోద్వేగం..!

Who

Who

ఇజ్రాయెల్‌- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు.

Read Also: Vemulawada: వేములవాడ ఆలయంలో శివ దీక్షలు.. 300 మంది భక్తులు మాలధారణ

ఇక, ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ చిన్నతనంలో స్వయంగా యుద్ధ పరిణామాలను చూశారు. 1998-2000 మధ్య ఎరిత్రియాతో సరిహద్దు యుద్ధ సమయంలో తన పిల్లలూ బంకర్లలో తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయని టెడ్రోస్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఘర్షణలు, ద్వేషం, ఆవేదన, విధ్వంసం తప్ప.. యుద్ధం ఎలాంటి పరిష్కారం ఇవ్వదని నా సొంత అనుభవంతో చెబుతున్నాను అని ఆయన వెల్లడించారు. అందుకే శాంతియుతంగా, రాజకీయంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో ఆకలి, అంటు రోగాలతో మరింత మంది చనిపోతారు అంటూ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.

Read Also: Budget 2024 : బడ్జెట్‌లో శుభవార్త.. రూ.8 లక్షల వరకు సాలరీపై నో టాక్స్ ?

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ వ్యాఖ్యలు నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని ఐరాసలోని ఇజ్రాయెల్‌ రాయబారి మీరవ్ ఐలాన్ షహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడి చేసినప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌ఓ వైఖరి భిన్నంగా ఉందన్నారు. ఇజ్రాయెల్‌లో సామాన్యులపై దాడి, మహిళలపై అత్యాచారాలు, బందీలు, ఆస్పత్రులను మిలిటరీ కేంద్రాలుగా మార్చుకోవటం లాంటి వాటిని అసలు ప్రస్తావించడం లేదని ఆయన గుర్తు చేశారు. హమాస్‌తో కలిసిపోవడం వల్లే డబ్ల్యూహెచ్ఓకు ఇవేవీ కనిపించడం లేదని ఇజ్రాయెల్‌ రాయబారి మీరవ్ ఐలాన్ ఆరోపించారు.

Exit mobile version