Waterless Washing Machine: టెక్నాలజీ మారుతుంది.. గతంలో వాడిని ఏ వస్తువుకు అయినా.. మరింత టెక్నాలజీ జోడించి అత్యాధునికంగా మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు.. ఇక, గృహోపకరణాల రంగంలో ప్రముఖ సంస్థ వర్ల్‌పూల్ భారత మార్కెట్లో వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త వాషింగ్ మెషిన్‌ను విడుదల చేసింది. Whirlpool Expert Care Front Load Automatic Washing Machine పేరుతో ఈ సరికొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి.. ఇందులోని ప్రత్యేకత ఏంటి? అంటారా.. దీని ప్రత్యేక ఏంటంటే.. నీరు లేదా డిటర్జెంట్ ఉపయోగించకుండానే బట్టలను శుభ్రం చేయడం దీని స్పెషాలిటీ..
ఓజోన్ ఫ్రెష్ ఎయిర్ టెక్నాలజీ హైలైట్
ఈ వాషింగ్ మెషిన్‌లో Ozone Fresh Air Technologyను అమర్చారు. తక్కువసేపు మాత్రమే ధరించిన బట్టలను ప్రతిసారి పూర్తిగా ఉతకాల్సిన అవసరం లేదని వర్ల్‌పూల్ పేర్కొంది. ఇలాంటి బట్టలను నీరు అవసరం లేకుండానే తాజాగా మార్చేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? అనే విషయాల్లోకి వెళ్తే.. వర్ల్‌పూల్ ఎక్స్‌పర్ట్ కేర్ వాషింగ్ మెషిన్‌లో అంతర్గతంగా ఓజోనైజర్ ఉంటుంది. ఇది ఆక్సిజన్‌ను ఓజోన్‌గా మార్చి డ్రమ్‌లోకి విడుదల చేస్తుంది. ఈ ఓజోన్ బట్టలపై ఉన్న దుర్వాసనలను తొలగించి.. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీంతో బట్టలు తాజాగా మారుతాయి. ముఖ్యంగా డ్రై-క్లీన్ ఫాబ్రిక్స్‌పై ఈ టెక్నాలజీని పరీక్షించగా, రంగు మారడం లేదా కుంచించుకుపోవడం జరగలేదని కంపెనీ స్పష్టం చేసింది. బట్టలను యంత్రం నుంచి తీసిన వెంటనే ధరించవచ్చని వర్ల్‌పూల్ పేర్కొంది.
ఇతర ముఖ్య ఫీచర్లు ఏమున్నాయి..?
వర్ల్‌పూల్ ఎక్స్‌పర్ట్ కేర్ శ్రేణిలో ఇంకా పలు ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. Steam Wash Technology.. లోడ్ మరియు ఫాబ్రిక్‌ను గుర్తించి డ్రమ్ కదలికను సర్దుబాటు చేసే 6th Sense Technology.. తక్కువ నీటి పీడనంలో కూడా పనిచేసే Zero Pressure Fill Technology.. 1400 RPM స్పిన్ స్పీడ్.. 330 మిల్లీమీటర్ల విశాలమైన డ్రమ్ ఓపెనింగ్.. అవసరమైతే ఈ యంత్రంలో సాధారణంగా నీరు, డిటర్జెంట్‌తో కూడా బట్టలను ఉతికే సదుపాయం కూడా ఉంది.
ధరతో పాటు.. వారంటీ వివరాలు..
వర్ల్‌పూల్ ఎక్స్‌పర్ట్ కేర్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ 7 కిలోల సామర్థ్యం గల వేరియంట్ ధర రూ.24,500 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉత్పత్తి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఈ ప్రొడక్ట్‌పై 5 సంవత్సరాల వారంటీ.. 10 సంవత్సరాల మోటార్ వారంటీ కూడా ఇస్తున్నారు.. ఈ కొత్త వాషింగ్ మెషిన్ నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని కంపెనీ చెబుతోంది. పర్యావరణహితంగా, ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఉత్పత్తి వినియోగదారుల నుంచి మంచి స్పందన పొందే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
