NTV Telugu Site icon

WhatsApp: వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్

Whatsapp1

Whatsapp1

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా నానాటికీ యాప్‌ వాడకాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తూ వస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌తో అలరించేందుకు సిద్ధమైంది. అదే వీడియో మోడ్ ఆప్షన్. దీని ద్వారా ఇతరులకు యాప్ నుంచే సులభంగా వీడియో తీసి పంపవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అప్‌డేట్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ట్యాప్ అండ్ హోల్డ్‌కు గుడ్ బై..

ఇప్పటివరకు వాట్సాప్‌లో యూజర్ ఏదైనా వీడియో రికార్డ్ చేయాలంటే ట్యాప్ అండ్ హోల్డ్ బటన్ వినియోగించేవారు. అయితే ఇప్పుడు దీనిని వాట్సాప్ పూర్తిగా అప్‌డేట్ చేసి కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ట్యాప్ అండ్ హోల్డ్ స్థానంలో ప్రత్యేకంగా వీడియో మోడ్‌ను ఆవిష్కరించింది. దీని కోసం కొన్ని బగ్‌లను యాప్‌లో ఫిక్స్ చేసింది. దీని ద్వారా వాట్సాప్ కాల్ నుంచి వీడియో మోడ్‌కు ఎలా స్విచ్ అవుతున్నారో ఫోటో నుంచి వీడియోకు ఇలా స్విచ్ అయ్యే వెసులుబాటు కలుగుతోంది. మీరు ఈ సరికొత్త ఫీచర్‌ను ఆస్వాదించాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి మీ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ 2.23.2.73 అప్‌డేట్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

మరిన్ని కొత్త ఫీచర్లు..

మరోవైపు వాట్సాప్ తన వినియోగదారులకు మరిన్ని కొత్త ఫీచర్లను అందించేందుకు ప్రణాళిక చేస్తోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇవి అందించేందుకు కసరత్తు చేస్తోంది. పిక్చర్ ఇన్ ప్లేస్ మోడ్, వ్యూ వన్స్ టెక్ట్స్, కాపానియన్ మోడ్, సెర్చ్ మెసేజెస్ బై డేట్, వాయిస్ నోట్స్ ఆన్ స్టేటస్, డెస్క్ టాప్ వెర్షన్ కి స్క్రీన్ లాక్, కాల్ టాబ్ వంటి అధునాతన ఫీచర్లను రానున్న అప్ డేట్లలో తీసుకువ్చే అవకాశం ఉంది. అలాగే కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్, ఎక్సో 2, మోర్నింగ్ బ్రీజ్ వంటి కొత్త రకం ఫాంట్స్ కూడా పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Freedom App: కోటి డౌన్‌లోడ్‌లను దాటిన ఫ్రీడమ్ యాప్.. రైతులు, వ్యాపారులకు లబ్ధి

Show comments