Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉ.10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల.. భక్తుల సేవా టికెట్లు డిప్‌కు ఈ నెల 21 ఉ.10గంటల వరకు నమోదుకు అవకాశం.. లక్కీడిప్‌ టికెట్లు పొందినవారు అదే రోజు మ.12లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలి.. ఈ నెల 22న కల్యాణోత్సవం, 23న అంగప్రదక్షిణం.. 24న మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటా విడుదల

*-నేడు తెలంగాణలో ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల.. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు.. పరీక్షలకు హాజరుకానున్న 9.8 లక్షల మంది విద్యార్థులు.

*తూర్పుగోదావరి: నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన.. మధ్యాహ్నం ఒంటిగంటకు పవన్ రాజమండ్రి ఎయిర్ పోర్టుకి రాక.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం.. సాయంత్రం ప్రత్యేక విమానంలో ‌ మంగళగిరి వెళ్లనున్న పవన్.

*విజయనగరం జిల్లాలో నేడు మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన.. చీపురుపల్లి చేరుకొని ఎంపీడీవో కార్యాలయం వద్ద గొర్రెల కాపరులకు పరికరాలను పంపిణీ చేయనున్న మంత్రి.. రాజాం చేరుకొని పట్టణ పీహెచ్సీ, సబ్ ట్రెజరీ, ఆర్‌టీసీ కాంప్లెక్స్ భవనాలు ప్రారంభోత్సవం పాల్గొననున్న మంత్రి.

*నేడు ‘మిలాన్‌-2024’ ప్రారంభం.. నేటి నుంచి విశాఖ వేదికగా ఈ నెల 27 వరకు ‘మిలాన్‌-2024’.. 50 దేశాల నుంచి రానున్న ప్రతినిధులు, నౌకలు, విమానాలు.

*అయోధ్యలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలన.. నేడు పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించే అవకాశం.. తిరుమల తరహాలో అయోధ్యలో భక్తుల సౌకర్యం కోసం టీటీడీ సహకారం కోరిన రామమందిరం ట్రస్ట్.

నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక దివ్య తిరు కళ్యాణం.. రాత్రి 12.29 గంటలకు( తెల్లవారితే 20 వ తేదీ) స్వామి కల్యాణం.. 20వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు రథోత్సవం.. లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,390.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,190.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.77,900.

Exit mobile version