Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు టీఎస్‌ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ. మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించనున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.

2. ఢిల్లీలో నేడు టీకాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తుది ఎంపికపై కసరత్తు. ఇప్పటికే 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. మిగితా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కమిటీ. ఢిల్లీ వార్‌రూమ్‌లో జరగనున్న సమావేశం.

3. వన్డే వరల్ట్‌కప్‌లో నేడు భారత్‌ తొలి పోరు. చెన్నై వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఆస్ట్రేలియాతో ఢీ. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా.

4. నేడు భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌ టికెట్ల అమ్మకం. 14న అహ్మదాబాద్‌లో భారత్‌-పాక్‌ హైఓల్టేజ్‌ మ్యాచ్‌. మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం.

5. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,540 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.75,000లుగా ఉంది.

6. విశాఖ.. గాజువాకలో నేడు భారీ గణనాథుడి నిమజ్జనం… గాజువాక లంక మైదానంలో కొలువు దీరిన 117 అడుగుల శ్రీ అనంత పంచముఖ గణనాథుడు. 21 రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు. విగ్రహం ప్రతిష్టించిన చోటే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న కమిటీ సభ్యులు… ఈరోజు సాయంత్రం 4. గంటలకు శ్రీ అనంత మహాగణపతి 117 అడుగుల వినాయకుడు నిమజ్జనం.

Exit mobile version