NTV Telugu Site icon

INDvsAUS 2nd Test: వార్నర్‌కు కాంకషన్.. రెండో టెస్టుకు దూరం!

3

3

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. తొలి రోజు బ్యాటింగ్ సమయంలో తలకు గాయమై ఈ టెస్టుకు దూరమయ్యాడు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ బ్యాటింగ్ దిగ‌డం లేదు. అతడి స్థానంలో కాంక‌ష‌న్‌ స‌బ్‌స్టిట్యూట్‌గా మ్యాట్ రెన్‌షా ఈ మ్యాచ్ ఆడబోతున్నట్లు ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ ప్రకటించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్‌గా రెన్‌షా బ్యాటింగ్ చేయ‌నున్నాడు.

Also Read: WPL 2023: ఆర్సీబీ కెప్టెన్‌గా మంధానా.. ప్రకటించిన కోహ్లీ, డుప్లెసిస్

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ సమయంలో సిరాజ్ వేసిన రెండు బౌన్సర్లు వార్నర్ త‌ల‌పై బ‌లంగా త‌గిలాయి. మ‌రోబాల్ మోచేయికి తాక‌డంతో వార్నర్ విలవిలాడిపోయాడు. నొప్పిని భ‌రిస్తూనే బ్యాటింగ్ చేసిన అత‌డు 15 ప‌రుగుల‌కు ఔట‌య్యాడు. త‌ల‌తో పాటు మోచేయి గాయం తీవ్రత తక్కువ‌గానే ఉన్నా వార్నర్ అల‌సిపోవ‌డంతోనే అత‌డికి ఈ టెస్టు నుంచి విశ్రాంతినిచ్చి రెన్‌షాను బ‌రిలోకి దించారు. శ‌నివారం మ‌రోసారి వార్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించే అవ‌కాశం ఉంది. మూడో టెస్టుకు వార్నర్ అందుబాటులోకి రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

Also Read: Minister Venugopala Krishna: చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. చంద్రబాబు సైకోలా మారాడు..!

Show comments