Site icon NTV Telugu

War 2 : ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసా..?

Whatsapp Image 2023 07 17 At 10.03.40 Pm

Whatsapp Image 2023 07 17 At 10.03.40 Pm

జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ఫ్యాన్స్ కృష్ణుడి పాత్రలో చూడాలని ఎంతగానో ఆశ పడుతున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలో కనుక నటిస్తే కృష్ణుడి పాత్రలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో వార్2 సినిమా కూడా ఉంది.కాగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మొదట స్నేహితులుగా కనిపించి తర్వాత శత్రువులుగా మారతారని సమాచారం.వీరిద్దరి కృష్ణార్జునుల పాత్రలను రెఫరెన్స్ గా తీసుకుని ఎన్టీఆర్ రోల్ ను కృష్ణుడి పాత్రను పోలి ఉండేలా అలాగే హృతిక్ రోల్ ను అర్జునుడి పాత్రను పోలి ఉండేలా ఫిక్స్ చేశారని సమాచారం అందుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు.వార్2 సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కొంత నెగిటివ్ షేడ్స్తో ఉండబోతుందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి..దేవర సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. అలాగే వార్2 సినిమాను 2025 లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం దేవర షూటింగ్ ను ఎన్టీఆర్ సైలెంట్ గా పూర్తి చేస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా వున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ వరుసగా మూడు ప్రాజెక్ట్ లను కమిట్ అయ్యారు. దేవర, వార్ 2 సినిమాలతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వార్ 2 సినిమా షూటింగ్ అయిన తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.

Exit mobile version