Vyooham : నరకాసురుల నవ్వులు.. రాబందుల హేళనలు అంటూ ఆసక్తి రేకెత్తిస్తున్న టైటిల్ సాంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితుల పై తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం. ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్స్ తోనే ఆర్జివి సంచలనాలు క్రియేట్ చేశారు.తాజాగా నేడు దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కావడంతో ఈ మూవీ నుంచి వ్యూహం టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ పూర్తిగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లోని లిరిక్స్ ఆసక్తి రేకేత్తిస్తున్నాయి.పులుల రూపం లో గుంట నక్కలు..అంటూ మొదలైనా అయినా ఈ సాంగ్.. నరకాసుల నవ్వులు..రాబందుల హేళనలు..జగనుడి మౌనం..రాక్షసుల నాట్యం అంటూ సాగుతుంది.
వ్యూహం సినిమా నుండి విడుదల అయిన మొదటి రెండు టీజర్ల లో చూపిన క్యారెక్టర్లన్నింటినీ మరోసారి ఈ సాంగ్‌లో చూపించారు. గాయత్రీ మంత్రం తో సాంగ్ ప్రారంభించడం లో ఆర్జీవీ మార్క్ స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్ చనిపోయినప్పుడు సోనియా, చంద్రబాబులు జగన్‌ను పరామర్శించడాన్ని ఈ సాంగ్ లో చూపించారు.అలాగే జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయడం.. జేడీ లక్ష్మీనారాయణ విచారించడం వంటి అంశాలు కూడా ఈ పాటలో కనిపిస్తోంది. జగన్ పాదయాత్ర వంటి అంశాలు కూడా చూపించడం జరిగింది. మొత్తంగా ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ కాస్త అటూఇటూ మార్చి మళ్లీ ఈ సాంగ్ లో చూపించారు.అలాగే ట్రైలర్ లో చూపించిన విధంగా పాట చివర్లో మళ్లీ చంద్రబాబు డైలాగ్ ను కూడా పెట్టారు ఆర్జీవి. ఏంటండి ఆ జనం.. మా నాన్న వెంటకానీ, వాళ్ల నాన్న వెంటకానీ అంత జనం రావడం ఎప్పుడూ కూడా చూడలేదంటూ చంద్రబాబు సతీమణి ఆయనతో అనడం.. “జనానికి బాగా పిచ్చి ముదిరింది”.. అంటూ చంద్రబాబు చెప్పే డైలాగ్‌తో ఈ సాంగ్ ముగుస్తుంది.ప్రస్తుతం ఈ సాంగ్ బాగా వైరల్ గా మారింది.
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Tags
- #title song
- #VYOOHAM
- RGV
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?