NTV Telugu Site icon

Vivo T3 Ultra 5G Price: భారత మార్కెట్లోకి వివో టీ3 అల్ట్రా 5జీ.. ఆకర్షణీయమైన డిజైన్‌, ఏఐ ఫీచర్స్!

Vivo T3 Ultra 5g Launch

Vivo T3 Ultra 5g Launch

Vivo T3 Ultra 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘వివో’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ‘వివో టీ3 అల్ట్రా 5జీ’ పేరుతో తీసుకొచ్చింది. ఇటీవల టీ సిరీస్‌లో తీసుకొచ్చిన వివో టీ3 ప్రోకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో.. టీ3 అల్ట్రాను రిలీజ్ చేసింది. ఇప్పటికే వివో టీ3 లైట్, వివో టీ3 ప్రో, వివో టీ3 ఎక్స్, వివో టీ3 ఉండగా.. టీ సిరీస్‌లో ఇప్పుడు టీ3 అల్ట్రా చేరింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ మొబైల్‌లో 50ఎంపీ సోనీ కెమెరాతో పాటు ఏఐ ఫీచర్లను ఇచ్చారు.

సెప్టెంబర్‌ 19 నుంచి వివో టీ3 అల్ట్రా 5జీ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ సహా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. లాంచ్ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్‌లపై రూ.3000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వివో ప్రకటించింది. వివో టీ3 అల్ట్రా 5జీ మూడు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ+128జీబీ వేరియెంట్ ధర రూ.31,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.33,999గా ఉంది. ఇక హై ఎండ్ వేరియంట్‌ 12జీబీ+256జీబీ ధర రూ.35,999గా కంపెనీ నిర్ణయించింది. లునార్‌ గ్రా, ఫ్రాస్గ్‌ గ్రీన్‌ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తాయి.

Also Read: Ravi Basrur: టైగర్ స్టూడియోకి వస్తేనే ఇలా ఉంటే.. ఇక ఎన్టీఆర్-నీల్ సినిమా షేక్ అవ్వాల్సిందే!

వివో టీ3 అల్ట్రా 5జీలో 6.78 ఇంచెస్ త్రీడి కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటు ఉండగా.. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14తో పనిచేస్తుంది. ఐపీ 68 రేటింగ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్‌.. 80 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వెనకవైపు 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ రియర్‌ కెమెరా ఉంటుంది. ముందువైపు సెల్ఫీ కోసం 50 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఏఐ ఎరేజర్‌, ఫొటోల క్వాలిటీ పెంచేందుకు, ఎడిట్‌ చేసేలా ఏఐ ఫీచర్లను ఇచ్చారు.

Show comments