వితిక షేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 11 సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనా జీవితాన్ని ప్రారంభించిన వితిక.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత యాంకర్ గా కూడా చేసింది.. 2008లో ఓ కన్నడ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లే. `ప్రేమించే రోజుల్లో` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.. తెలుగు అమ్మాయి కావడంతో అస్సలు అవకాశాలు రాలేదని తెలుస్తుంది..
హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. `పడ్డానండి ప్రేమలో మరి` సినిమాలో వరుణ్ సందేశ్, వితిక జంటగా నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో ఈ జంట కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు.. విన్నర్ గా నిలవలేదు కానీ.. తమదైన ఆటతీరులో తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ తర్వాత వితిక బులితెర ఈవెంట్స్ లో సందడి చేస్తూనే.. మరోవైపు యూట్యూబ్ లో సొంతంగా ఛానెల్ ను ప్రారంభించింది..
ఆ ఛానెల్ త్వరగానే క్లిక్ అయ్యింది..ఆరున్నర లక్షల సబ్‌స్క్రైబర్లు వితికా యూట్యూబ్ ఛానెల్ ను ఫాలో అవుతున్నారు. ప్రతి శుక్రవారం ఈ బ్యూటీ ఒక వీడియోను విడుదల చేస్తుంటుంది. వితిక ఇప్పటివరకు దాదాపు 160 వీడియోను పోస్ట్ చేసింది.. వీడియోకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇక వితిక షేరు యూట్యూబ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వితిక నెలకు దాదాపు రూ. 5 నుంచి 6 లక్షల వరకు సంపాదిస్తుందట.. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.. మొత్తానికి సినిమాలు చేయకున్నా కూడా బాగానే సంపాదిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..