NTV Telugu Site icon

Viswak Sen : ప్రమోషన్స్ అలా చేద్దామనుకున్నాం .. కానీ..?

Viswaksen (1)

Viswaksen (1)

Viswak Sen : విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించారు.నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ మాస్ పెర్ఫార్మన్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించగా హీరో విశ్వక్ సేన్ ,దర్శకుడు కృష్ణ చైతన్య పాల్గొని ఆసక్తికర విషయాలు తెలియజేసారు.

Read Also :Akhanda 2 : విలన్స్ వేట మొదలుపెట్టిన బోయపాటి..

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.అయితే కొంతమంది కావాలని ఈ సినిమాకు ఫేక్ రివ్యూ ఇస్తున్నారు.ఉదయం 6 గంటల నుండే ఈ సినిమాకు రివ్యూలు ఇస్తున్నారు.అంటే రివ్యూ ఇచ్చేవారు కనిసం సినిమా చూడకుండానే రివ్యూస్ ఇస్తున్నారు.ఈ సినిమా టికెట్స్ కొన్న వారికే “బుక్ మై షో” లో రివ్యూ ఇచ్చేలా చూడాలి అని విశ్వక్ తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సినిమాను గోదావరి ప్రాంతంలో తెరకెక్కించారు గోదావరి అందాలతో పాటు పగలు ,ప్రతీకారాలు వంటివి కూడా చూపించారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఎందుకు అక్కడ నిర్వహించలేదు అని ప్రశ్నించగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను రాజమండ్రి లో నది పక్కన నిర్వహించాలని అనుకున్నాము. కానీ ఎన్నికల కోడ్ ఉండటంతో అది సాధ్యపడలేదు.అందుకే ప్రమోషన్స్ అంతా కూడా హైదరాబాద్ లో నిర్వహించడం జరిగిందని విశ్వక్ తెలిపారు.

Show comments