Viswak sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.
Read Also :Bharateeyudu 2: భారతీయుడు 2లో మరో హీరోయిన్.. ఈ ట్విస్ట్ ఏంటి సామీ!
థియేటర్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.అద్భుతమైన కలెక్షన్స్ దూసుకుపోతున్న ఈ సినిమా రీసెంట్ గా బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది.ఈ సినిమా జూన్ 14 న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది.ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.విశ్వక్ సేన్ హీరోగా నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో “మెకానిక్ రాకీ” అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా విశ్వక్ సేన్ 10 వ మూవీగా తెరకెక్కుతుంది.ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో విశ్వక్‌సేన్ పాల్గొంటున్నాడని సమాచారం.